Biometric: మేడ్చల్- మల్కాజిగిరి కలెక్టరేట్‌లో బయోమెట్రిక్
ABN , Publish Date - Feb 07 , 2025 | 10:06 AM
మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్(Medchal-Malkajgiri Collectorate)లో ఎట్టకేలకు బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చింది. కలెక్టరేట్ కార్యాలయాన్ని తూంకుంట మున్సిపల్ అంతాయపల్లిలో జీప్లస్ టూ అంతస్తులో 86 గదుల్లో ఏర్పాటు చేశారు.

హైదరాబాద్: మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టరేట్(Medchal-Malkajgiri Collectorate)లో ఎట్టకేలకు బయోమెట్రిక్ విధానం అమల్లోకి వచ్చింది. కలెక్టరేట్ కార్యాలయాన్ని తూంకుంట మున్సిపల్ అంతాయపల్లిలో జీప్లస్ టూ అంతస్తులో 86 గదుల్లో ఏర్పాటు చేశారు. కలెక్టర్‌తోపాటు ఇద్దరు అదనపు కలెక్టర్‌లు, డీఎంహెచ్‌వో, డీఆర్వో, డీఆర్డీవో, డీపీవో, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఉద్యోగులు దాదాపు 400 మంది విధులు నిర్వహిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మీ బిల్డింగ్‌ను ముందే చూడొచ్చు..
కలెక్టరేట్‌లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆరు నెలల క్రితమే కలెక్టర్ గౌతమ్ ఆదేశాలతో కలెక్టరేట్ ఏవో చర్యలు చేపట్టారు. బయోమెట్రిక్ విధానం ద్వారా ఉద్యోగుల హాజరు శాతాన్ని మెరుగు పర్చడంతోపాటు విధుల నిర్వహణ సక్రమంగా సాగుతుందనేది అధికారుల ఆలోచన. అధికారులు, సిబ్బంది రోజు ఉదయం 10.30 గంటలకు కార్యాలయానికి చేరుకుని సాయంత్రం 5 గంటల వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మధ్యలో అధికారులు ఫీల్డ్‌కు వెళ్లాల్సి వస్తే కార్యాలయం నుంచి వెళ్లే సమయం,
వచ్చే సమయం కూడా బయోమెట్రిక్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. కలెక్టరేట్(Collectorate)లో నాలుగు చోట్ల బయోమెట్రిక్ మెషీన్లను ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. ఈమేరకు కలెక్టరేట్‌లో పనిచేస్తున్న వివిధ శాఖల ఉద్యోగుల వివరాలను బయోమెట్రిక్ యంత్రాల్లో నమోదు చేశారు. అన్ని చర్యలు తీసుకున్న అధికారులు బయోమెట్రిక్ విధానం ప్రారంభానికి ఆరు నెలలుగా ప్రయతిస్తున్నా, సాంకేతిక కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేశారు.
ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు
ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్ ఎన్నికలకే మొగ్గు
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర
ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Read Latest Telangana News and National News