Share News

Bandi Sanjay: అలా చేస్తే ఒక్క రూపాయి ఇవ్వం.. రేషన్ కార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 25 , 2025 | 02:25 PM

New Ration Cards: రేషన్ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలా చేస్తే ఒక్క రూపాయి ఇవ్వమన్నారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..

Bandi Sanjay: అలా చేస్తే ఒక్క రూపాయి ఇవ్వం.. రేషన్ కార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Central Minister Bandi Sanjay

ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ఫొటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమన్నారు. తామే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని ప్రెస్ మీట్‌లో పేర్కొన్నారు సంజయ్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ మీద ఆయన విమర్శలు గుప్పించారు.


ఎందుకు అరెస్ట్ చేయట్లేదు?

రేవంత్‌కు గురువు కేసీఆరేనని బండి సంజయ్ అన్నారు. ‘రేవంత్‌కు కేసీఆరే గురువు. కేసీఆర్ ఏం చేశారో.. రేవంత్ అదే చేస్తున్నారు. రేవంత్ పనిలో కొత్తదనం ఏమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? కాళేశ్వరం అవినీతి ఎక్కడకు పోయింది? కేసీఆర్‌ను జైల్లో ఎందుకు వేయడం లేదు? రేపే అరెస్ట్ అని ఇంకా ఎన్ని రోజులు అంటారు? ఫార్ములా కారు రేసు కేసులో కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? గ్రీన్ కో కంపెనీ నుంచి కాంగ్రెస్‌కు డబ్బులు ముట్టాయ్. దావోస్‌కు రెండుసార్లు పోయినా.. పెట్టుబడులపై స్పష్టత లేదు. శ్వేత పత్రం విడుదల చేయాలి’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.


ఇవీ చదవండి:

సంచలన విషయాలు బయటపెట్టిన రాచకొండ సీపీ

అనుమతిలేని ప్రైవేట్‌ ఆస్పత్రులపై చర్యలు తీసుకోండి

పోచారం పరిధిలో హైడ్రా కూల్చివేతలు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 25 , 2025 | 02:42 PM