Share News

2న బయోగ్యాస్‌ ప్లాంట్‌కు భూమిపూజ

ABN , Publish Date - Mar 22 , 2025 | 01:34 AM

రిలయన్స్‌ కంప్రె్‌సడ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ నిర్మాణానికి వచ్చే నెల 2వ తేదీన భూమిపూజ చేయనున్న దృష్ట్యా అందుకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని శాసనసభ్యుడు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సూచించారు. రిలయన్స్‌ ప్రతినిధులతోపాటు విద్యుత్‌, పంచాయతీరాజ్‌ అధికారులు, డీఎస్పీతో కలిసి శుక్రవారం ఆ ప్లాంట్‌ కోసం వెంగళాయపల్లి పంచాయతీ పరిధిలో కేటాయించిన భూమి ని ఎమ్మెల్యే పరిశీలించారు.

2న బయోగ్యాస్‌ ప్లాంట్‌కు భూమిపూజ
అధికారులతో కలిసి బయోగ్యా్‌సకు కేటాయించిన భూమిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ఉగ్ర

మంత్రి లోకేష్‌, అనంత్‌ అంబానీ రాక

అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఉగ్ర

పీసీపల్లి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : రిలయన్స్‌ కంప్రె్‌సడ్‌ బయోగ్యాస్‌ ప్లాంట్‌ నిర్మాణానికి వచ్చే నెల 2వ తేదీన భూమిపూజ చేయనున్న దృష్ట్యా అందుకు అవసరమైన ఏర్పాట్లను వేగవంతం చేయాలని శాసనసభ్యుడు డాక్టర్‌ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సూచించారు. రిలయన్స్‌ ప్రతినిధులతోపాటు విద్యుత్‌, పంచాయతీరాజ్‌ అధికారులు, డీఎస్పీతో కలిసి శుక్రవారం ఆ ప్లాంట్‌ కోసం వెంగళాయపల్లి పంచాయతీ పరిధిలో కేటాయించిన భూమి ని ఎమ్మెల్యే పరిశీలించారు. రెవెన్యూ అధికారులు భూమి వివరాల మ్యాప్‌ను ఎమ్మెల్యేకు చూపిస్తూ వివరించారు. అనంతరం ఎమ్మె ల్యే అధికారులకు పలు సూచనలు చేశారు. భూమిలో పెద్దగా ఉన్న వేపచెట్లను తొలగించవద్దని సూచించారు. అలాగే దివాకరపల్లి నుంచి నిర్దేశిత స్థలం వరకు విశాలంగా రోడ్డును ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్‌ అధికారులకు చెప్పారు. భూమిపూజ అనంతరం బహిరంగ సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు లోకేష్‌, గొట్టిపాటి రవికుమార్‌, స్వామి, రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబా నీ, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి అధికారులు హాజరవుతారని చెప్పారు. ఆర్‌అండ్‌బీ అధికారులతో మాట్లాడి 2 హెలిప్యాడ్‌లను సిద్ధం చేయాలని సూచించారు. వీఐపీల వాహనాల రాకపోకలకు ఒకదారి, ప్రజలకు మరో దారిని ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ సాయిఈశ్వర్‌యశ్వంత్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ డీఈ శ్రీధర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ ధర్మతేజపాల్‌, రిలయన్స్‌ ప్రతినిధులు ప్రదీప్‌, ఫణీంద్ర, శివరాం, సీఐ ఖాజావలి, వీఆర్వో రఫి, నాయకులు వేమూరి రామయ్య, సానికొమ్ము తిరుపతిరెడ్డి(ఎ్‌సటీఆర్‌), కోటపాటి రామారావు, ఉండేల మల్లికార్జున్‌రెడ్డి, కోమటిగుంట్ల వీరయ్య, ప్రసాద్‌, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2025 | 01:34 AM