Share News

విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Mar 20 , 2025 | 10:42 PM

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు.

విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాటర్‌ ప్లాంటును ప్రారంభిస్తున్న ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/ తెలకపల్లి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్ర భుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో క మ్యూనిటీ డెవలప్‌మెంట్‌ ఫౌండేష న్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆర్వో వాటర్‌ ప్లాంటుతోపాటు, కళాశాల ఆవరణలో బొటానికల్‌ గార్డెన్‌ను ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. సోషల్‌ మీడియా, మొబైల్‌ ఫోన్లకు దూరంగా ఉంటూ విద్యపై దృష్టి కేంద్రీకరించాలని విద్యార్థులకు సూచించా రు. కళాశాల అభివృద్ధికి తనవంతుగా కృషి చే స్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. కార్యక్రమం లో కళవాశాల ప్రిన్సిపాల్‌ అంజయ్య, కమ్యునిటీ డెవలప్‌మెంట్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు శ్రీనివా సరావు, ముజీబ్‌, శేఖర్‌, అధ్యాపకులు, విద్యార్థు లు పాల్గొన్నారు.

ఫ తెలకపల్లి మండల పరిధిలోని గౌరెడ్డిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో గురువారం నీటి శుద్ధీకరణ యంత్రాన్ని ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి ప్రారంభించారు. సీడీఎఫ్‌ సహకారంతో నాలుగు లక్షలతో ఏర్పాటు చేసినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే.సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీడీఎఫ్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో శ్రీనివాసులు, ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌ఐ నరేష్‌, డీఎస్‌వో రాజశేఖర్‌రెడ్డి, సింగిల్‌ విండో వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.యాదయ్య, మాజీ ఎంపీపీ బండ పర్వతా లు, మాజీ సర్పంచ్‌ బాలగౌడ్‌, కాంగ్రెస్‌ నాయ కులు వెంకటయ్యగౌడ్‌, పీఆర్‌టీయూ నాయకు లు చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 10:42 PM