Share News

విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:51 PM

ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతోందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల అకస్మికంగా పరిశీలించారు.

విద్యారంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

లక్షెట్టిపేట, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టితో ముందుకు సాగుతోందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల అకస్మికంగా పరిశీలించారు. పాఠశాల తరగతి గుదులతో పాటు వంటశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం సకల సదు పాయాలు కల్పిస్తుందన్నారు. ఇటీవల విద్యార్థులకు మెస్‌ చార్జీలను కూడా పెంచిందన్నారు. మద్యాహ్న భోజనం నూతన మెనూ ప్రకారం మంచి పౌష్టికాహారం అందించాలని వంటశాల, కూరగాయలు, మంచి నాణ్యమైన సరుకులు ఉపయోగించాలని సూచించారు. 10వ తగరతి విధ్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణ పట్టుదలతో పరీక్షలు రాసి మంచి మార్కుటు సాదించాలని మంచిర్యాల జిల్లా ఈఏడాది 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలతో ప్రథమ స్థానంలో ఉండాలన్నారు. అదే విధంగా పట్టణంలోని నూతనంగా నిర్మాణం చేపడుతున్న 30పడకల ఆసుపత్రి భవన నిర్మాణం పనులను పరిశీలించి పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి నిర్వహకులకు పలు సలహాలు సూచనలు అందజేసారు. ఈకార్యక్రమంలో కలెక్టర్‌ వెంట అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 11:51 PM