Share News

High Court: ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్‌

ABN , Publish Date - Mar 28 , 2025 | 05:05 AM

లండన్‌ నుంచి ఇంటర్నెట్‌ కాల్‌ చేసిన నిందితుడు అఖిలే్‌షరెడ్డి రూ.20 లక్షలు ఇవ్వకపోతే.. చంపేస్తానంటూ బెదిరించాడంటూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది సెప్టెంబరు 29న కొత్తపల్లి(కరీంనగర్‌ జిల్లా) పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

High Court: ఎమ్మెల్యే సత్యంను బెదిరించిన వ్యక్తికి బెయిల్‌

క్వాష్‌ పిటిషన్‌లో హైకోర్టు బెయిల్‌.. కేసు కొట్టివేతకు నిరాకరణ

  • దర్యాప్తు చేపట్టాలని నిర్దేశం

  • ఏడేళ్లలోపు శిక్ష పడే కేసులో రిమాండ్‌కు పంపడంపై ఆగ్రహం

  • దర్యాప్తు అధికారి, మెజిస్ట్రేట్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశం

హైదరాబాద్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఇంటర్నెట్‌ కాల్‌ ద్వారా బెదిరించిన యాస అఖిలేశ్‌ రెడ్డికి హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అఖిలేశ్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేసు కొట్టివేతకు నిరాకరించిన ధర్మాసనం.. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసింది. చట్టప్రకారం కేసు దర్యాప్తు కొనసాగించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఏడేళ్ల లోపు శిక్ష పడే కేసుల్లో బీఎన్‌ఎ్‌సఎ్‌స-35 (సీఆర్పీసీ 41ఏ) ప్రొసీజర్‌ను పరిశీలించకుండా యాంత్రికంగా నిందితుడిని రిమాండ్‌కు పం పిన కరీంనగర్‌ మొదటి అదనపు జ్యుడీషియల్‌ మెజిస్ర్టేట్‌తోపాటు దర్యాప్తు అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. లండన్‌ నుంచి ఇంటర్నెట్‌ కాల్‌ చేసిన నిందితుడు అఖిలే్‌షరెడ్డి రూ.20 లక్షలు ఇవ్వకపోతే.. చంపేస్తానంటూ బెదిరించాడంటూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు గత ఏడాది సెప్టెంబరు 29న కొత్తపల్లి(కరీంనగర్‌ జిల్లా) పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. లండన్‌లో ఉన్న నిందితుడిపై పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేశారు.


ఈ క్రమంలో నిందితుడు భారత్‌కు తిరిగిరావడంతో పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపించారు. ఫిబ్రవరి 10 నుంచి నిందితుడు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నాడు. కేసు కొట్టేయాలని నిందితుడు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. గురువారం జస్టిస్‌ లక్ష్మణ్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. నిందితుడి తరఫున న్యాయవాది శరత్‌కుమార్‌ వాదిస్తూ.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను నిందితుడు కులం పేరుతో దూషించకపోయినా అట్రాసిటీ కేసు పెట్టారని ఆరోపించారు. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లలో నోటీసులిచ్చి విచారించాల్సి ఉండగా.. నేరుగా జైలుకు పంపారని తెలిపారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వాదిస్తూ.. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపుతామంటూ ఎమ్మెల్యేను బెదిరించడాని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. నిందితుడు చేసిన నేరానికి ఏడేళ్లలోపు జైలుశిక్ష పడే సెక్షన్లు మాత్రమే వర్తిస్తాయని, ఈ విషయాన్ని దర్యాప్తు అధికారి గానీ, రిమాండ్‌కు పంపేముందు మేజిస్ర్టేట్‌ గానీ పరిశీలించలేదని వ్యాఖ్యానించింది. పిటిషనర్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్న మాట వాస్తవమే కాబట్టి దర్యాప్తు కొనసాగాలని, కేసును కొట్టేయడం లేదని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌-21 ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడాలన్న ఉద్దేశంతో ‘అర్ణబ్‌ గోస్వామి ’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి.. క్వాష్‌ పిటిషన్‌లో నిందితుడికి బెయిల్‌ ఇస్తున్నట్లు తెలిపింది. నిందితు డు తన పాస్‌పోర్టును డిపాజిట్‌ చేయాలని, విదేశాలకు వెళ్లరాదని స్పష్టం చేసింది. ప్రొసీజర్‌ అనుసరించని దర్యాప్తు అధికారిపై, యాంత్రికంగా జైలుకు పంపిన మేజిస్ర్టేట్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఆయా అథారిటీలను ఆదేశించింది.

Updated Date - Mar 28 , 2025 | 05:05 AM