Etela Rajender : కాంగ్రెస్ నేతలు పరువు తీసుకున్నారు.. ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్
ABN , Publish Date - Feb 01 , 2025 | 07:17 PM
Etela Rajender: దేశాన్ని గ్రీన్ ఎనర్జీ, సోలార్, విండ్ ఎనర్జీ దిశగా తీసుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో బొగ్గు విద్యుత్ ఉన్న ప్రాంతాలు అన్ని బొందల గడ్డలుగా మారాయని విమర్శించారు. కొన్ని మందులపై ట్యాక్స్ లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందని ఎంపీ ఈటల రాజేందర్ చెప్పారు.

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అభినందనీయమని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని 50 ఏళ్ల పాటు పరిపాలిందని చెప్పారు. బడ్జెట్‌పై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అవగాహన లేకుండా మాట్లాడి వారి పరువు తీసుకున్నారని విమర్శించారు. శనివారం నాడు ఢిల్లీ వేదికగా ఎంపీ ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. దేశం మొత్తానికి బడ్జెట్ పెడతారని.., ఒక రాష్టం కోసం బడ్జెట్ పెట్టరని చెప్పారు. ఈ బడ్జెట్ దేశానికి ఒక మార్గాన్ని ఇచ్చిందని అన్నారు. దాని అనుగుణంగా ఇప్పుడు బడ్జెట్ ఉందని తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునప్రారంభించింది ప్రధానమంత్రి నరేంద్రమోదీ అని గుర్తుచేశారు. రైతాంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
గతంలో కాంగ్రెస్ హయాంలో ఎరువుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేదని చెప్పారు. పప్పు దినుసులను అందించాలని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని అన్నారు. కల్తీ లేని నూనెను ప్రజలకు అందించాలని కేంద్రం ఆలోచన చేసిందని చెప్పారు. మహిళలకు ఆర్థిక శక్తి ఇచ్చే విధంగా రుణాలు ఇస్తుందన్నారు. ఈ దేశంలో కరెంట్ లేకపోతే జీవితం లేదని చెప్పుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది గ్రీన్ ఎనర్జీ అంశంపై మాట్లాడుతున్నారని అన్నారు. దేశాన్ని గ్రీన్ ఎనర్జీ సోలార్, విండ్ ఎనర్జీ దిశగా తీసుకెళ్లాలని కేంద్రం అడుగులు వేస్తుందని తెలిపారు. తెలంగాణలో బొగ్గు విద్యుత్ ఉన్న ప్రాంతాలు అన్ని బొందల గడ్డలుగా మారాయని విమర్శించారు. కొన్ని మందులపై ట్యాక్స్ లేకుండా కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అన్నివర్గాల ప్రజల బాధలను అర్థం చేసుకొని బడ్జెట్ ప్రవేశ పెట్టారని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Harish Rao on Union Budget: దేశమంటే కొన్ని రాష్ట్రాలేనా.. బడ్జెట్‌పై హరీష్ విమర్శలు
Congress MLA's: కాంగ్రెస్ నేతల రహస్య సమావేశం.. వాళ్లే టార్గెట్‌గా..
Revanth Reddy: మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం.. కారణమిదే..
Read Latest Telangna News And Telugu News