Share News

ఆగని అక్రమ నిర్మాణాలు....

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:53 PM

జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపులేకుం డా పోతోంది. ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్లో అక్రమం గా వెలిసిన వెంచర్లలోని ప్లాట్లను అక్రమ పద్ధతుల్లో చేజిక్కించుక్కుంటూ వాటిలో పక్కా భవనాలు నిర్మి స్తున్నా అడిగే నాథుడే కరువయ్యారు.

ఆగని అక్రమ నిర్మాణాలు....

-మూన్నాళ్ల ముచ్చటగా మారిన కూల్చివేతలు

-అధికారుల తీరుపై ప్రజల విస్మయం

-కూల్చిన చోట మళ్లీ నిర్మితమవుతున్న భవనాలు

మంచిర్యాల, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపులేకుం డా పోతోంది. ప్రభుత్వ, అసైన్డ్‌ భూముల్లో అక్రమం గా వెలిసిన వెంచర్లలోని ప్లాట్లను అక్రమ పద్ధతుల్లో చేజిక్కించుక్కుంటూ వాటిలో పక్కా భవనాలు నిర్మి స్తున్నా అడిగే నాథుడే కరువయ్యారు. కలెక్టర్‌ కార్యా లయానికి కూతవేటు దూరంలో అక్రమ నిర్మాణా లు కొద్ది రోజులుగా ఊపందుకోవడం గమనార్హం. అవే స్థలాల్లో గతంలో నిర్మించిన ఇళ్లను సమూలం గా కూల్చివేసిన మున్సిపల్‌ అధికారులు ఆరంభ శూ రత్వం ప్రదర్శించారనే అభిప్రాయాలు ఉన్నాయి. గ తంలో కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు జరుగుతు న్నా తమకేమీ సంబంధం లేన్నట్టు చేతులు ముడు చుకొని కూర్చుండటమే దీనికి నిదర్శనం.

చతికిలబడ్డ చట్టం....

మున్సిపాలిటీల పరిధిలో అనుమతులు లేకుండా చేపట్టే నిర్మాణాలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభు త్వం మున్సిపల్‌ చట్టం 2019లోని టీఎస్‌-బీ పాస్‌కు కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా లేఅవుట్‌ పర్మిషన్‌, భవన నిర్మాణాలకు అనుమతు లు, తదితర ప్రక్రియను పటిష్టం చేసేందుకు కలెక్టర్‌ పర్యవేక్షణలో జిల్లా టాస్క్‌ఫోర్స్‌ బృందాలను సైతం నియమించింది. నిబంధనలను అతిక్రమించే వారిప ట్ల కఠినంగా వ్యవహరించేలా టాస్క్‌ఫోర్స్‌ బృందాల కు విస్తృత అధికారాలను ప్రభుత్వం కట్టబెట్టింది. అందులో భాగంగా అనుమతులు లేని నివాస గృ హాలు, కమర్షియల్‌ భవనాలతోపాటు లేఅవుట్‌ లేని వెంచర్లలోని నిర్మాణాలను ఎలాంటి ముందస్తు నోటీ సులు జారీ చేయకుండానే నేరుగా కూల్చే అధికారం టాస్క్‌ఫోర్స్‌ బృందాలకు ఉంది. ఆ చట్టం ప్రకారం 2021 సెప్టెంబరులో జిల్లా కేంద్రంలోని వంద ఫీట్ల బైపాస్‌ రోడ్డులో అక్రమంగా నిర్మిస్తున్న రెండు భవ నాలను టాస్క్‌ఫోర్స్‌ బృందం కూల్చివేసింది. అయితే గతకొద్ది రోజులుగా అక్రమ నిర్మాణాలు జరుగుతు న్నా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పట్టించుకోక పో వడంతో చట్టం చతికిలబడ్డట్లు కనిపిస్తోంది.

ఇవీ నిబంధనలు....

భవన నిర్మాణాలు చేపట్టే ప్రజలు అనుమతుల కోసం దరఖాస్తు చేసే సమయంలో సమర్పించిన ప్లాన్‌ను విధిగా అమలు పర్చాలి. అనుమతి కాపీలో పేర్కొన్న విధంగా నిర్మాణం చేపట్టాలి. సెట్‌ బ్యాక్‌, రోడ్డు నిబంధనలు పాటించడంతోపాటు అనుమతు లు ఉన్న మేరకు పై అంతస్థుల నిర్మాణం చేపట్టాలి. గృహావసరాల కోసం అనుమతులు పొంది, కమర్షి యల్‌గా ఉపయోగించే వారిని సైతం నిబంధనల ఉల్లంఘన జాబితాలో చేర్చుతారు. గృహ, కమర్షియ ల్‌ భవన నిర్మాణాలతోపాటు లే అవుట్‌ అనుమతు లు లేకుండా ఏర్పాటు చేసే ప్లాట్లు చట్ట విరుద్ధం కా గా, అలాంటి వాటిపై టాస్క్‌ఫోర్స్‌ బృందాలకు చర్య లు తీసుకొనే అధికారం ఉంది.

ఆనాటి చర్యలేవి...?

జిల్లా కేంద్రంలోని హమాలివాడలో 2021 జూలై లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ఓ బహుళ అంతస్థుల భవనం స్లాబును టాస్క్‌ఫోర్స్‌ బృందం సభ్యులు కూల్చేందుకు ప్రయత్నిస్తుండగా అప్పటి అధికార పార్టీకి చెందిన నాయకులు అడ్డుకోవడంతో అధికారులు వెనుదిరిగారు. అదే సంవత్సరం ఆగస్టు లో నస్పూర్‌లోని రెడ్డి కాలనీలో ప్లాన్‌కు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాల గోడలతో పాటు షెడ్లను సైతం మున్సిపల్‌ అధికారులు కూల్చివేశారు. అప్పుడు కూ డా పెద్ద రాద్దాంతమే జరిగింది. అదే సమయంలో బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోనూ నిబంధనలకు విరుద్ధంగా వెలసిన కట్టడాలను టాస్క్‌ఫోర్స్‌ బృందా లు కూల్చివేస్తుండగా మెజార్టీ కౌన్సిలర్లు అడ్డుకు న్నారు. దీంతో చేసేదేమీలేక టాస్క్‌ఫోర్స్‌ బృందం వె నుదిరగాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా నస్పూర్‌ శివా రు సర్వే నంబర్‌ 11,64,42లలోని ప్రభుత్వ భూము ల్లో వెలిసిన నివాస గృహాలు, ఇతర కట్టడాలను రెం డేళ్ల కిందట అధికారులు తొలగించారు. గత సంవ త్సరం సెప్టెంబరు 19న నస్పూర్‌లో అసైన్డ్‌ భూమి లో నిర్మించిన బీఆర్‌ఎస్‌ నేత ఢీకొండ అన్నయ్యకు చెందిన ఐదంతస్తుల భవనాన్ని అధికారులు నేలమ ట్టం చేశారు. దీంతో అప్పట్లో అధికారుల చర్యలపట్ల ప్రశంసల జల్లులు కురిశాయి. అయితే అనతికాలం లోనే అక్రమ కట్టడాలపై అధికారుల చర్యలు నిలిచి పోగా, కళ్లెదుటే కొత్త నిర్మాణాలు జరుగుతున్నా ప ట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం నస్పూర్‌లోని తోళ్లవాగు ఒడ్డున వెలి సిన నిర్మాణాలను తొలగించిన అధికారులు.... ప్రస్తు తం అదే ప్రాంతంలో మళ్లీ కట్టడాలు ఊపందుకు న్నా పట్టించుకోకపోవడం తీవ్ర చర్చనీయాంశం అ వుతోంది. దీంతో అధికారులే స్వయంగా టీఎస్‌ బీ పాస్‌ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారనే విమర్శలు మూటగట్టు కోవలసి వస్తోంది.

60 మందికిపైగా నోటీసులు జారీ....

మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్‌ 42లో ఆది నుంచి వివాదం నెలకొని ఉంది. అందులో మొత్తం 102 ఎకరాల స్థలం ఉంది. అందులో కొంత మొత్తా న్ని గతంలోనే కొన్ని నిరుపేద కుటుంబాలకు ప్రభు త్వం అసైన్‌ చేసింది. మిగతా భూమిలో 28 ఎకరా లను టీఎన్‌జీవో సభ్యులకు ఇళ్ల స్థలాల కోసం కేటా యించినట్లు చెబుతున్నారు. అదిపోను మిగతా స్థలం కాలక్రమేణ... కబ్జాలకు గురవుతూనే ఉంది. కలెక్టరేట్‌ ను ఆనుకొని ఉండటంతో ప్రస్తుతం ఆ భూముల ధర ఎకరాకు సుమారు రూ. 4 కోట్లు ఉంటుంది. దీంతో ఆ స్థలంలో అక్రమంగా బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. దీంతో అక్రమ నిర్మాణాలు చే పట్టిన దాదాపు 60 మందికిపైగా రెండేళ్ల క్రితమే మున్సిపల్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయిన కబ్జాల పర్వం ఆగకపోగా రోజు రోజుకూ వి స్తరిస్తూనే ఉంది. గతంలో పలుమార్లు సర్వే సైతం నిర్వహించినా...అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

అక్రమ నిర్మాణాలపై చర్యలు ఉండేనా...?

నస్పూర్‌ శివారు సర్వే నంబర్‌ 42లో అధికారులు నోటీసులు జారీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటా రా...? అన్న సందేహం ప్రస్తుతం ప్రజల్లో నెలకొంది. ఐదంతస్థుల భవనం ఓ బీఆర్‌ఎస్‌ నాయకునికి చెం దినది కావడంతో అధికారులు తక్షణమే స్పందించి కూల్చివేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంతరం పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు జరిగినా స్పందనలేకపోవడమే దీనికి నిదర్శనం. ఇ ప్పటికైనా అధికారులు అక్రమ నిర్మాణాలన్నింటి పై నా తక్షణ చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. తమ, పర బేధం లేకుండా అక్రమార్కులంద రిపైనా ఒకే రకమైన చర్యలు చేపట్టాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Mar 20 , 2025 | 11:53 PM