Share News

అసైన్డ్‌ భూముల లెక్క తేలేనా...?

ABN , Publish Date - Mar 22 , 2025 | 11:41 PM

ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్‌ ఆర్‌ఎస్‌ ప్రక్రియలో....అసైన్డ్‌ భూముల గుర్తింపును చేపట్టాలని రేవంత్‌ సర్కారు నిర్ణయానికి వచ్చింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎంతమేరకు భూములు అసైన్‌ చేయబడ్డాయి, ఎక్కెడెక్క ఆ భూ ములును ప్లాట్లుగా మార్చారు..? ఎన్ని భూములు అన్యాక్రాంతం అయ్యాయి...? అనే అంశాలపై స్పష్టత రానుంది.

అసైన్డ్‌ భూముల లెక్క తేలేనా...?

-ఎల్‌ఆర్‌ఎస్‌ పరిశీలనలో భాగంగా గుర్తింపునకు చర్యలు

-ప్రభుత్వ నిర్ణయంతో అక్రమార్కుల్లో గుబులు

-జిల్లాలో పెద్ద ఎత్తున భూములు అన్యాక్రాంతం

-విచ్చలవిడిగా వెంచర్లు చేసి ప్లాట్ల అమ్మకాలు

-ఏజెన్సీ భూములనూ వదలని రియల్టర్లు

మంచిర్యాల, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ప్లాట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్‌ ఆర్‌ఎస్‌ ప్రక్రియలో....అసైన్డ్‌ భూముల గుర్తింపును చేపట్టాలని రేవంత్‌ సర్కారు నిర్ణయానికి వచ్చింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎంతమేరకు భూములు అసైన్‌ చేయబడ్డాయి, ఎక్కెడెక్క ఆ భూ ములును ప్లాట్లుగా మార్చారు..? ఎన్ని భూములు అన్యాక్రాంతం అయ్యాయి...? అనే అంశాలపై స్పష్టత రానుంది. సర్కారు నిర్ణయం వల్ల అసైన్డ్‌ భూముల లెక్క ఇక పక్కాగా తేలనుంది. ఇప్పటి వరకు ఉమ్మ డి జిల్లాలో అసైన్డ్‌ భూములు ఎన్ని ఉన్నాయి..? అ వి ఎవరి చేతిలో ఉన్నాయి..? ఎన్ని పరాధీనం అ య్యాయి..? అనే లెక్కలు లేవు. గత ప్రభుత్వాలు ఈ దిశగా పెద్ద ప్రయత్నాలు చేయలేదు. అసలు అసైన్డ్‌ భూములపై గత బీఆర్‌ఎస్‌ సర్కారు పెద్దగా దృ ష్టిసారించలేదన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి.

ధరణి రాకతో ఇష్టారాజ్యం....

ధరణి పోర్టల్‌ అందుబాటులోకి వచ్చిన తరువాత కబ్జాదారులు కోట్ల విలువైన అసైన్డ్‌ భూములను అ ప్పనంగా కాజేజి, వాటిలో దర్జాగా వెంచర్లు ఏర్పాటు చేసి విచ్చల విడిగా విక్రయాలు చేసి సొమ్ము చేసు కున్నారు. ఒకసారి అవి రెగ్యులరైజ్‌ అయితే శాశ్వ తంగా వారి సొంతమైనట్లే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో దరఖాస్తులు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ము న్సిపాలిటీల వద్ద పెండింగులో ఉండగా, ఒక్క మం చిర్యాల మున్సిపాలిటీలోనే 600 వీఎల్టీ (వేకేట్‌ ల్యాం డ్‌ ట్యాక్స్‌) దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికా రులు తెలిపారు. ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల పరిశీల నకు ముగ్గురు అధికారుల చొప్పున పలు బృందాల ను నియమించారు. ప్రస్తుతానికి 2020 ఆగస్టు 26వ తేదీలోపు రిజిస్ట్రేషన్‌ అయి ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికే ఆ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే.

అసైన్డ్‌ భూముల లెక్కలపై ఆరా....

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీ లించేటప్పుడు అసైన్డ్‌ భూములపైనా ప్రధానంగా దృ ష్టిసారించాలని రేవంత్‌ సర్కారు కలెక్టర్లను ఆదేశిం చింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గద ర్శకాల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ ఆమోదం కోసం క్షేత్రస్థాయిలో జరిపే పరిశీలనలో మున్సిపల్‌ అధికారులకుతోడు రె వెన్యూ, నీటిపారుదల శాఖకు భాగస్వామ్యం కల్పించింది. గతంలో ఒక్క మున్సిపాలిటీ అధికారు లు, లేదంటేవారి కిందిస్థాయి సిబ్బంది మాత్రమే ప రిశీలన జరిపేవారు. దరఖాస్తు చేసుకున్న స్థలాలు అసైన్డ్‌ భూములా...? కాదా...? అనేది తమకు అందు బాటులో ఉన్న రికార్డు ప్రకారం మాత్రమే ధృవీకరిం చుకునేవారు. మున్సిపాలిటీ వద్ద ఉన్న అరకొర రికా ర్డుల వల్ల కొన్నిసార్లు అసైన్డ్‌ స్థలాలు సైతం రెగ్యుల రైజ్‌ అయిన ఉదంతాలు ఉన్నాయి. దీనికి తోడు కొం దరు మున్సిపల్‌ అధికారులు, కిందిస్థాయి సిబ్బంది క్షేత్ర పరిశీలనలో అవి అసైన్డ్‌ భూములు అని తేలి నా ముడుపులకు ఆశపడి రెగ్యులర్‌ చేసిన దాఖలా లు కూడా ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు ల క్షేత్రస్థాయి పరిశీలనలో మున్సిపల్‌ శాఖతో పాటు రెవెన్యూ, నీటిపారుదల శాఖలను కూడా భాగస్వా ములను చేస్తోంది.

పూర్తిస్థాయిలో దరఖాస్తుల పరిశీలన..

గతంలో మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రణాళిక విభా గం సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించేవారు. కొత్త ఆదేశాల మేరకు ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను మూడు దశల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్దేశిం చింది. మున్సిపల్‌ ప్రణాళిక విభాగం సూపర్‌వైజర్‌తో పాటు నీటి పారుదల శాఖ ఏఈ, రెవెన్యూ ఇన్‌స్పె క్టర్‌, ముగ్గురు కలిసి ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు వివరా లను పూర్తిస్థాయిలో పరిశీలిస్తారు. అది ప్రభుత్వ, ఆ సైన్డ్‌ భూమా ? ప్రైవేటు స్థలామా...? వివాదాలు ఏ మైనా ఉన్నాయా ? అనేది రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ గుర్తి స్తారు. బఫర్‌ జోన్‌ నిబంధనల మేరకు చెరువులు, కుంటలు, వాగులు, నాలాల పక్క నుంచి ఎంత దూ రంలో ఉంది...? అనుమతులు ఇవ్వాలా లేదా అనేది నీటి పారుదల శాఖ ఏఈ పర్యవేక్షిస్తారు. ఆ స్థలం నివాస ప్రాంతం (రెసిడెన్షియల్‌ ఏరియా), వాణిజ్య ప్రాంతం, పారిశ్రామిక ప్రాంతం..

ఇలా ఏ జోన్‌లోకి వస్తుంది, జత చేసిన పత్రాలు సరినవా...కావా అనేది పట్టణ ప్రణాళిక విభాగం సూపర్‌ వైజర్‌ గుర్తిస్తారు. తద్వారా అసైన్డ్‌ భూములను గుర్తించడం తేలిక కా నుంది. వీరు ముగ్గురు అమోదించాకే ఎల్‌ 1 లాగిన్‌ నుంచి పట్టణ ప్రణాళిక విభాగం అధికారి (ఎల్‌ 2 లాగిన్‌)కి దరఖాస్తును పంపిస్తారు. అక్కడి నుంచి ఎల్‌ 3 లాగిన్‌ పర్యవేక్షించే మున్సిపల్‌ కమిషనర్‌కు వెళుతుంది. రుసుం చెల్లించాక కమిషనర్‌ ఆమోదం తో ఎల్‌ఆర్‌ఎస్‌ పత్రం జారీ చేస్తారు. పెద్ద లే అవు ట్‌ల క్రమబద్ధీకరణ రికార్డులను ఎల్‌ 4 దశలో భా గంగా కలెక్టర్ల పరిశీలనకు పంపుతారు.

అసైన్డ్‌ భూముల్లో రియల్‌ వెంచర్లు..!

జీవనోపాధి కోసం ప్రభుత్వం అర్హతగల వారికి పంపిణీ చేసిన అసైన్డ్‌ భూముల్లో విచ్చల విడిగా ప్లాట్ల వెంచర్లు వెలిశాయి. జిల్లా కేంద్రంలోని నస్పూ ర్‌లో గల సర్వే నెంబర్లు 42, 64లలోని అసైన్డ్‌ భూ ముల్లో బడా వెంచర్లు వెలిశాయి. అంతేకాదు గిరిజ న చట్టాల ప్రకారం అర్హులైన పేదలకు పంపిణీ చేసి న భూములను సైతం వదలిపెట్టలేదంటే అతిశ యోక్తికాదు. 1966 కంటే ముందు ప్రభుత్వం అసైన్డ్‌ చేసిన భూములకు ఎన్‌ఓసీ (నో ఆబ్జెక్షన్‌ సర్టిఫి కెట్లు)లు జారీ అయ్యాయి. దాన్ని అవకాశంగా మలు చుకొని కొందరు ఆ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యా పారం మొదలు పెట్టారు. ఇదే అదునుగా కొందరు నకిలీ ఎన్‌వోసీలు సృష్టించి అమ్మడానికి వీలులేని భూములను అన్యాక్రాంతం చేశారు. జిల్లాలోని దండే పల్లి, మందమర్రి మండలాల్లో గిరిజన భూముల్లో నూ వెంచర్లు వెలిశాయి. అయితే ఎల్‌ఆర్‌ఎస్‌ సమ యంలో అసైన్డ్‌ భూములను కనుగొనడం కొంత ఇ బ్బందిగా మారగా, కొత్త మార్గదర్శకాలతో ఎల్‌ఆర్‌ ఎస్‌ ప్రక్రియలో వేగం పెరుగనున్నదనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి.

ఆందోళనలో అక్రమార్కులు.....

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రధానంగా అసైన్డ్‌ భూములపై దృష్టి పెట్టనుండడం తో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కోసం ప్లాట్లు కొన్నవారు సైతం ఆందోళనకు గురవుతున్నారు. గతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పేదల నుంచి అసైన్డ్‌ భూము లను తక్కువ ధరలకు కొనుగోలు చేసి వెంచర్లు ఏ ర్పాటు చేసి ఇష్టారీతిన విక్రయించారు. అందులో ఇ ళ్లు నిర్మించుకునేందుకు వీలుగా క్రమబద్ధీకరణ కో సం దరఖాస్తు చేసుకున్న వారు క్షేత్రస్థాయి పరిశీల నలో అవి అసైన్డ్‌ భూములని తేలితే ఎక్కడ తమ ను నిలదీస్తారోనన్న భయం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రులను వెంటాడుతోంది. ఇప్పటికే చాలా మంది త మ ఇంటి స్థలం ఎలాంటి వివాదంలోనైనా చిక్కుకుని ఉందా అన్న విషయమై తమదైన మార్గాల్లో ఆరా తీస్తుండగా, అధికారులు కఠినంగా వ్యవహిస్తే కబ్జా లకు గురైన అసైన్డ్‌ భూములు వెలుగు చూసే అవ కాశాలు ఉన్నాయి.

Updated Date - Mar 22 , 2025 | 11:41 PM