బీసీల పట్ల బీజేపీది నిర్లక్ష్య వైఖరి: జాజుల
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:48 AM
దేశవ్యాప్త జనగణనలో సమగ్ర కులగణన చేపట్టి బీసీల రిజర్వేషన్లను పెంచాలని, లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమించకతప్పదని కేంద్రాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ హెచ్చరించారు.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్త జనగణనలో సమగ్ర కులగణన చేపట్టి బీసీల రిజర్వేషన్లను పెంచాలని, లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమించకతప్పదని కేంద్రాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్ హెచ్చరించారు. తెలంగాణ బీసీ బిల్లులను కేంద్రం ఆమోదించాలని మూడు రోజులుగా తెలంగాణ భవన్‌లో ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న బీసీ ఆజాదీ జేఏసీ నేత బత్తుల సిద్ధేశ్వర్‌కు గురువారం జాజుల మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిద్ధేశ్వర్ ఆరోగ్యం క్షీణించకముందే కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బీసీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, మహిళా బిల్లులో బీసీ మహిళలకు వాటా, కేంద్ర బడ్జెట్‌లో బీసీల వాటా తేల్చకుండా బీసీల పట్ల బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. కాగా సిద్ధేశ్వర్ దీక్షకు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ ఠాగూర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ మంత్రి శ్రీనివా్‌సగౌడ్ మద్దతు తెలిపారు.