ప్రతిపాదనలకే సరి...
ABN , Publish Date - Mar 21 , 2025 | 02:56 AM
జిల్లాలో పత్తిపాక రిజర్వాయర్, పోతారం ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని జిల్లా రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి.

జిల్లాలో పత్తిపాక రిజర్వాయర్, పోతారం ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని జిల్లా రైతులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. బుధ వారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 3,04,965 కోట్ల రూపాయలతో అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. సాగునీటి పారు దల రంగానికి 23,373 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటా యించారు. జిల్లాలో ప్రతిపాదించిన పత్తిపాక రిజర్వా యర్, పోతారం ఎత్తిపోతల పథకానికి నిధులు కేటాయించలేదు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి, మంథని, రామగుండం, కరీంనగర్ జిల్లా కరీంనగర్, చొప్పదండి, జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గాల్లోని దాదాపు రెండు లక్షల 10 వేల ఎకరాల ఎస్సారెస్పీ ఆయకట్టు భూములను స్థిరీకరించడంతోపాటు కొత్తగా పది నుంచి 20 వేల ఎక రాలకు సాగునీరు అందించేందుకు ధర్మారం మండలం పత్తిపాక వద్ద 5 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని గత ప్రభుత్వ హయాంలో ప్రతిపా దించారు. కాని పనులు ముందుకు సాగలేదు. ఏడాది క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పత్తిపాక రిజర్వాయర్‌ను నిర్మిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింత కుంట విజయరమణారావు హామీఇచ్చారు. జిల్లా పర్య టనకు వచ్చిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలు సైతం పత్తిపాక చేపడ తామని హామీలు ఇచ్చారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌బాబు సైతం ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కలిసి నవం బర్ 23న పత్తిపాకను సందర్శించి ప్రతిపాదిత రిజ ర్వాయర్ స్థలాన్ని పరిశీలించారు. ఇందుకోసం సుమారు 2500 కోట్ల రూపాయలతో తాత్కాలికంగా డీపీఆర్‌ను రూపొందించారు. బడ్జెట్లో ఈ రిజర్వాయర్‌కు నిధులు కేటాయిస్తారని ఆశించినప్పటికీ భంగపాటే ఎదుర య్యింది. నిధులు కేటాయించకున్నా ఎమ్మెల్యే విజ యరమణారావు చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించాలని రైతులు కోరుతున్నారు.
ఫ పోతారం ఎత్తిపోతలకు కేటాయించని నిధులు
మంథని నియోజకవర్గంలోని మంథని, కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం మండలాల్లోని సుమారు 22 వేల ఎకరాల ఎస్సారెస్పీ ఆయకట్టును స్థీరికరించడంతో పాటు కొత్తగా 8 వేల ఎకరాల భూములకు సాగునీటిని అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్రతి పాదించిన పోతారం ఎత్తిపోతల పథకానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. మంథని నియోజకవర్గ ప్రాంత రైతన్నలు నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని చేపట్టక పోగా, కనీసం ఇప్పుడైనా పనులు ప్రారంభమవుతాయని ఆశిం చారు. బడ్జెట్లో నిధులు కేటాయించకపోయినా మంత్రి శ్రీధర్‌బాబు చొరవ తీసుకోవాలనిరైతులు కోరుతున్నారు.
ఫ శ్రీపాద ఎల్లంపల్లికి రూ.350 కోట్లు
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మిగులు పనులకు ఈ బడ్జెట్లో ప్రభుత్వం 350 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఈ నిధులతో ప్రాజెక్టు ద్వారా రెండు లక్షల ఎకరాల భూములకు సాగునీరు అందించాలనే లక్ష్యం నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినప్పటికీ రెండో దశ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల పరిధిలో చేపట్టాల్సిన కాలువల నిర్మాణాలు, ఫీల్డ్ ఛానళ్లు, పలు రిజర్వాయర్ల పనులు పూర్తి కాలేదు. నిధుల కేటాయింపుతో పనులు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఫ ప్రాణహిత చేవెళ్లకు రూ.32 కోట్లు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు 32 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి బీఆర్‌ఎస్ ప్రభు త్వం అధికారంలోకి రాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. ప్రాణహిత నదిపై తుమ్మిడి హెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి గ్రావిటీ ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి నీరు తరలించి అక్కడి నుంచి పంపుల ద్వారా చేవెళ్ల వరకు సాగునీటిని అం దించాలని ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అయితే కేసీఆర్ గోదావరి నదిపై రివర్స్ ఎత్తిపోతల ద్వారా మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద బ్యారేజీలు నిర్మించి శ్రీపాద ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోశారు. ఇది సత్ఫ లితాలు ఇవ్వకపోగా, మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు కుంగడంతోపాటు అన్నారం బ్యారేజీకి బుంగ పడింది. సుందిళ్ల బ్యారేజీకి మరమ్మతులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడం లేదు. తమ ప్రభుత్వ హయాంలో ముందుగా ప్రతి పాదించిన ప్రాణహిత నదిపై బ్యారేజీ నిర్మాణం చేపట్టి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రెండు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించి శ్రీపాద ఎల్లంపల్లి ద్వారా సాగు నీటిని ఎత్తిపోస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇది వరకే చెప్పారు. ఏప్రిల్ నెలలో బ్యారేజీ పనులు చేపడతామని ఇటీవల మంత్రి ప్రకటిం చారు. ఆ మేరకు 32 కోట్ల రూపాయల నిధులను బడ్జెట్‌లో కేటాయించడంతో పనులకు శ్రీకారం చుట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా కాళే శ్వరం ప్రాజెక్టుకు సైతం 2,685 కోట్లు కేటాయించారు. వివిధ ప్యాకేజీల్లో మిగిలిన పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు.