Share News

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు ఇవ్వాలి

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:41 AM

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు, సూచనలు అందించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు.

పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు ఇవ్వాలి

సిరిసిల్ల మార్చి 28 (ఆంధ్రజ్యోతి): పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు, సూచనలు అందించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హైద రాబాద్‌ నుంచి ఓటరు జాబితా సవరణపై లా అండ్‌ ఎన్‌ఫోర్స్‌ మెంట్‌పై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ సందీప్‌కమార్‌ ఝా పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ గతంలో కంటే ఎన్ని కలను రాబోయే రోజుల్లో మెరుగ్గా నిర్వహించేందుకు అన్నీ వర్గాలకు చెందిన ఓటర్లను భాగస్వాములను చేసేందుకు వినూత్న కార్యక్రమాలు అమలు చేయాలని అన్నారు. ఇందు కోసం అవసరమయ్యే సలహాలు సూచనలు ఇవ్వాలని అన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సిబ్బంది తమ పాత్ర పట్ల విధుల గురించి పూర్తిగా తెలుసుకోవాలని అన్నారు. శాంతిభద్రతల నిర్వహణ, ఎన్నికల ప్రవర్తన నియామావళి అమలుకు చేపట్టాల్సిన చర్యల గురించి సలహాలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో సిరిసిల్ల అర్డీవో రాధాబాయి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:42 AM