Share News

ఉపాధిహామీ కూలి పెంపుపై నిరాశ

ABN , Publish Date - Apr 01 , 2025 | 12:47 AM

మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేరకు వేతనాలు పెంచక పోవ డంతో కూలీలు నిరాశకు గురవుతున్నారు. గతేడాది 28 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈసారి కేవలం 7 రూపాయలు మాత్రమే పెంచి వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది.

ఉపాధిహామీ కూలి పెంపుపై నిరాశ

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆశించిన మేరకు వేతనాలు పెంచక పోవ డంతో కూలీలు నిరాశకు గురవుతున్నారు. గతేడాది 28 రూపాయలు పెంచిన ప్రభుత్వం ఈసారి కేవలం 7 రూపాయలు మాత్రమే పెంచి వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. బహిరంగ మార్కెట్‌లో రోజురోజుకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతుండగా, వాటికి అనుగుణంగా ఉపాధి హామీ వేతనాలు పెరగడం లేదు. యేటా కేంద్ర ప్రభు త్వం వేతనాలు పెంచుతున్నది. 2022లో 12 రూపా యలు పెంచిన ప్రభుత్వం 2023లో రూ.15, 2024లో రూ.28 పెంచగా, ఈసారి అంతకంటే ఎక్కువగానే పెరు గుతుందని ఆశించారు. ప్రస్తుతం ఉపాధిహామీ కూలీ వేతనం రూ.300 ఇస్తుండగా, పెంచిన 7 రూపాయలతో 307కు చేరుకున్నది. పెంచిన వేతనాలు ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటిం చింది. పథకం ఆరంభంలో పూర్తి స్థాయి కూలీ 87.50 రూపాయలు ఉండగా, పద్దెనిమిదేళ్లలో 219.5 రూపాయలు పెరగడం గమనార్హం.

2005-06లో ఉపాధిహామీ పథకానికి చట్టబద్ధత

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేని సమ యంలో కూలీలకు ఉపాఽధి పనులు కల్పించేందుకు 2005-06లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉపాధిహామీ పథకానికి చట్టబద్ధత కల్పించింది. కూలీల వలసలను నియంత్రించి స్థానికంగానే ఉపాధి పనులను గుర్తించి పని కల్పించే ఉద్ధేశ్యంతో ఈ పథకాన్ని తీసుకవచ్చారు. ఈ పథకం ద్వారా ప్రతీ కుటుంబానికి ఏడాదికి 100 పని దినాలు కల్పించాలని చట్టంలో పేర్కొన్నారు. యేటా నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో ఉపాధిహామీ పథకం సిబ్బంది, అధికారులు గ్రామసభలు నిర్వహించి పను లను చేపడుతున్నారు. కేటాయించిన బడ్జెట్‌లో తప్పని సరిగా 60 శాతం నిధులను కూలీలకు వేతనాల కింద చెల్లించి, 40 శాతం నిధులను మెటీరియల్‌ కంపొనెంట్‌ పనుల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఈ పథకం కింద మొత్తం 206 పనులను గుర్తించారు. 18 ఏళ్లుగా ఈ పథకం ద్వారా గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించ డంతో పాటు సీసీ రోడ్డు నిర్మాణాలు, మురికి కాలువలు, అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ భవనాలు, స్వశక్తి భవనాలు, రైతువేదికలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, తదితర శాశ్వత పనులు చేపట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చెరువుల్లో పూడికతీత పను లు మినహా వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధా న్యం ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది.

జిల్లాలో 1,18,949 జాబ్‌ కార్డులు..

జిల్లాలోని 266 గ్రామపంచాయతీల పరిధిలో 1,18,949 కుటుంబాలకు జాబ్‌ కార్డులు ఉండగా, 2,43,437 మంది కూలీలు ఉన్నారు. ఇందులో 59 వేల కుటుంబాలకు చెందిన 85 వేల మంది కూలీలు ఉపాధిహామీ పనులకు వస్తుంటారు. వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్న కుటుంబాలు 1575 మంది ఉన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 25.55 లక్షల పని దినాల లక్ష్యం విధించగా, దానిని అధిగమించి 25.98 లక్షల పని దినాలు చేశారు. సగటున ఒక్కో కూలీకి 217.33 రూపాయల వేతనం వచ్చింది. అత్యంత ఎక్కువగా కొందరు కూలీలు రోజుకు 378.40 రూపాయల వేతనం పొందారు. ఉపాధిహామీ పథకం ద్వారా జిల్లాలో 89 కోట్ల 30 లక్షల రూపాయలు వెచ్చించారు. ఇందులో కూలీలకు వేతనాల కింద 58 కోట్ల 66 వెచ్చించారు. పరిపాలన కింద 4 కోట్ల 95 లక్షల 33 వేల రూపాయలు ఖర్చు చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి 35 లక్షల పని దినాలను ప్రతిపాదిం చారు. నాలుగేళ్లలో ఈసారి మాత్రమే కూలీ ధర తక్కు వ పెంచడంతో కూలీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఉపాధి కూలీని మరింత పెంచాలని కూలీలు కోరుతున్నారు.

Updated Date - Apr 01 , 2025 | 12:47 AM