మైనింగ్ శాఖలో సిబ్బంది కొరత
ABN , Publish Date - Apr 01 , 2025 | 12:50 AM
జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత వేదిస్తోంది. పోస్టులు మంజూరు కాకపోవడం, మంజూరు అయిన పోస్టులు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉంటుండడంతో అవస్థలు ఎదురవుతున్నాయి. దీంతో మైనింగ్ శాఖలోని అధికారులు ప్రజలకు అందుబాటులోకి రావడమే గగనంగా మారుతోంది.

జగిత్యాల, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లా మైనింగ్ శాఖ కార్యాలయంలో సిబ్బంది కొరత వేదిస్తోంది. పోస్టులు మంజూరు కాకపోవడం, మంజూరు అయిన పోస్టులు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉంటుండడంతో అవస్థలు ఎదురవుతున్నాయి. దీంతో మైనింగ్ శాఖలోని అధికారులు ప్రజలకు అందుబాటులోకి రావడమే గగనంగా మారుతోంది. కార్యాలయం చుట్టూ తిరిగినా సమాధానం చెప్పేందుకు సైతం అధికారులు ఉండని పరిస్థితి నెలకొంది. జిల్లాలో పలు క్రషర్ యూనిట్లు, క్వారీలు ఉన్నాయి. వాటి పర్యవేక్షణతో పాటు అక్రమంగా తరలించే ఇసుక, మట్టి, కంకర తదితర వాటిపై నిఘా పెట్టాల్సి ఉంటుంది. కానీ ఈ శాఖలో ఉన్నదే ముగ్గురు అధికారులు. దీంతో పర్యవేక్షణ లేకుండా పోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చాలా రోజుల నుంచి మైనింగ్ శాఖలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఖాళీగా ఆరు పోస్టులు
జిల్లా మైనింగ్ శాఖలో ఒక ఏడీ, ఒక రాయల్టీ ఇన్స్‌పెక్టర్, ఒక జూనియర్ అసిస్టెంట్ మాత్రమే పనిచేస్తున్నారు. కార్యాలయానికి మంజూరు అయిన ఇతర అయిదు పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. కార్యాలయంలో టెక్నికల్ అసిస్టెంట్ ఒకరు, సర్వేయర్ ఒకరు, అసిస్టెంట్ జియాలజిస్ట్ ఒకరు, టెక్నికల్ అసిస్టెంట్ ఒకరు, అటెండర్ ఒకరు, స్వీపర్ ఒకరు, కంప్యూటర్ ఆపరేటర్ ఒకరు ఉండాల్సి ఉంది. కానీ కార్యాలయంలో ప్రస్తుతం తొమ్మిది పోస్టులకు ముగ్గురు పనిచేస్తుండగా, ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం అదనంగా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించుకొని నిర్వహణ కొనసాగించాల్సిన అవసరమున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు.
జిల్లాలో మైనింగ్ శాఖ నిర్వహణ ఇలా..
జిల్లాలో చిన్న తరహా ఖనిజములైన బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్, రాయి, కంకర తదితర ఖనిజ సంపద ఉంది. ప్రతియేటా సుమారు రూ. 23.86 కోట్ల ఆదాయం మైనింగ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి సమకూరుతుంది. జిల్లా వ్యాప్తంగా 71 వివిధ క్వారీలు 330.946 హెక్టార్లలో ఉన్నాయి. వీటిలో రెండు బ్లాక్ గ్రానైట్‌లు 20.880 హెక్టార్లలలో, 43 కలర్ గ్రానైట్‌లు 237.032 హెక్టార్లలో, రాయి, 25 కంకర క్వారీలు 70.034 హెక్టార్లలలో విస్తరించి ఉన్నాయి. క్వారీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రతియేటా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ద్వారా