Share News

ఉద్రిక్తంగా సీపీఐ ధర్నా

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:05 AM

సీపీఐ ఆధ్వర్యంలో నగరంలో చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. మంగళవారం నగరంలోని కమాన్‌ చౌరస్తాలో వంటగ్యాస్‌ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు యత్నించారు.

ఉద్రిక్తంగా సీపీఐ ధర్నా
సీపీఐ నాయకులు, పోలీసుల తోపులాట

భగత్‌నగర్‌, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): సీపీఐ ఆధ్వర్యంలో నగరంలో చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తంగా మారింది. మంగళవారం నగరంలోని కమాన్‌ చౌరస్తాలో వంటగ్యాస్‌ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీపీఐ నాయకులు, పోలీసులకు జరిగిన తోపులాటలో సీపీఐ జిల్లా కౌన్సిల్‌ సభ్యుడు పైడిపల్లి రాజు తలకు గాయమై రక్తస్రావమైంది. తోపులాటతో కొంత మంది కిందపడగా గాయాలయ్యాయి. ఆందోళనతో కమాన్‌చౌరస్తా ప్రాంతంలో వాహనాలు నిలిచిపోయాయి.

వంటగ్యాస్‌ ధరలు పెంచి పేదలపై భారం మోపిన కేంద్రం

- సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ అయిల్‌ ధరలు తగ్గినా కేంద్రం చమురు ధరలను తగ్గించకుండా ఆయిల్‌ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం వత్తాసు పలుకుతుందని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి అన్నారు. అర్ధరాత్రి వంటగ్యాస్‌ 50 రూపాయలు పెంచి పేదలపై భారం మోపి పెట్రోల్‌, డీజిల్‌పై రెండు రూపాయలు పెంచి వీటిని కంపెనీలే భరించాలని కేంద్ర మంత్రి ప్రకటించడం దుర్మార్గమన్నారు. మోదీ ప్రభుత్వం 11 సంవత్సరాల్లో పేదలపై అనేక మార్లు భారం మోపిందన్నారు. వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే పోలీసులు సీపీఐ నాయకులు, కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించడం సరికాదన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు పొనగంటి కేదారి, జిల్లా కార్యవర్గ సభ్యుడుకొయ్యడ సృజన్‌కుమార్‌, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, పైడిపల్లిరాజు, కిన్నెర మల్లవ్వ, సాయవేణి రాయమల్లు, బ్రామండ్లపల్లి యుగేంధర్‌, న్యాలపట్ల రాజు,బోనగిరి మహేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 12:05 AM