ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేవల విస్తరణ
ABN , Publish Date - Mar 27 , 2025 | 01:06 AM
సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ సేవలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అందించే విధంగా విస్తరించాలని తీర్మానించారు.

సిరిసిల్ల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ సేవలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అందించే విధంగా విస్తరించాలని తీర్మానించారు. 2025-2026 బ్యాంక్ అంచనా బడ్జెట్ రూ 14 కోట్లకు ఆమోదించారు. బుధవారం సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపం లో సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ అర్ధవార్షిక సంవత్సరపు మహా సభ చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ అధ్యక్షతన జరిగింది. బ్యాంక్‌కు నూతనంగా ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిపై తీసుకోవడం, బ్యాంక్‌లో సైబర్‌సెక్యూరిటీ చర్యలు వంటివి తీసుకునే విధంగా చర్చించారు. చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి సభ్యులకు 12 శాతం డివిడెండ్ కింద వారిఖాతాల్లో రూ 21.42 లక్షలు జమ చేశామని తెలిపారు. బ్యాంక్‌లో డిపాజిట్లు రూ 10109.06 లక్షల కు చేరుకుందని తెలిపారు. బ్యాంక్ నుంచి రూ.7888.49లక్షలకు రుణా లు పెరిగాయని తెలిపారు. బ్యాంక్ నికరలాభం రూ.3.58 కోట్లకు చేరు కుందన్నారు. సభ్యులు రాగుల జగన్ మాట్లాడుతూ బ్యాంక్ సేవలు పట్టణ ప్రజలకు మరింత విస్తరించాలని కోరారు. సభ్యులు ఎర్రం వెం కట్రాజం, దొంత దేవదాస్‌లు మాట్లాడుతూ సభ్యులకు డివిడెండ్ పెం చాలని, అప్పులపై వడ్డీ తగ్గించాలని కోరారు. బియ్యంకార్ శ్రీనివాస్ మాట్లాడుతూ బకాయిదారుల జాబితాను వార్షిక నివేదికలో ముద్రించా లని శ్రేయోనిధిని పెంచాలని కోరారు. గుండ్లపల్లి శ్రీనివాస్, కోడం అశో క్‌లు మాట్లాడుతూ ఏటీఎంలు విస్తరించాలని అన్నారు. రాజమౌళి మా ట్లాడుతూ సభ్యులకు డివిడెండ్‌ను క్రమం తప్పకుండా ఇవ్వాలన్నారు. మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ సిరిసిల్ల ప్రజలందరూ బ్యాంక్‌లో ఖాతాలు పొంది వ్యాపార కార్యాకలాపాలను నిర్వహించుకో వాలన్నారు. మాజీ చైర్మన్ గాజుల బాలయ్య మాట్లాడుతూ బ్యాంక్ డిపాజిట్లు రూ.వంద కోట్లు దాటిందని ఇది బ్యాంక్ పెరుగుదాలకు శుభసూచకమన్నారు. మాజీ చైర్మన్లు దార్నం లక్ష్మీనారాయణ, గాజుల నారాయణ, గడ్డం విఠల్‌లు మాట్లాడుతూ బ్యాంక్ అభివృద్ధికి పాలకవ ర్గం కృషి చేయాలన్నారు. వైస్‌చైర్మన్ అడ్డగట్ల మురళి, డైరెక్టర్లు గుడ్ల సత్యానం దం, చొప్పదండి ప్రమోద్, పాటి కుమార్‌రాజు, బుర్ర రాజు, వేముల చుక్కమ్మ, అడ్డగట్ల దేవదాస్, ఎనగందుల శంకర్, వలుస హరిణి, పత్తిపాక సురేష్, కోడం సంజీవ్, సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ రమాదేవి, బ్యాంక్ సీఈవో పత్తిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.