Share News

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

ABN , Publish Date - Mar 29 , 2025 | 12:45 AM

అసాంఘిక కార్యకలాపాల కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్‌ బి గితే అన్నారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

రుద్రంగి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : అసాంఘిక కార్యకలాపాల కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్‌ బి గితే అన్నారు. శుక్రవారం రుద్రంగి పోలీస్‌ స్టేషన్లతో పాటు రుద్రంగి-మానాల చెక్‌పోస్ట్‌ను ఆయన సందర్శించారు. అనం తరం పోలీస్‌స్టేషన్ల పరిసరాలు, సిబ్బంది పనితీరు, సర్కిల్‌ పరిధి లో నమోదు అవుతున్న కేసుల వివరాలు, పెండింగ్‌ కేసుల వివరాలు అడిగి తెలుసుకుని త్వరగా పూర్తిచేయాలని ఆదేశిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎల్లప్పుడూ ప్రజ లకు అందుబాటులో ఉంటూ సమర్థవంతమైన సేవలు అంద జేయాలని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చే యాలన్నారు. విజిబుల్‌ పోలీసింగ్‌లో భాగంగా అధికారులు, విలేజ్‌ పోలీస్‌ అధికారులు తరచూ గ్రామాలు పర్యటిస్తూ ప్రజలతో మమేకం అవుతూ సైబర్‌ నేరాలు, ట్రాఫిక్‌ నియ మాలు, అక్రమ బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్స్‌ వల్ల కలిగే అనర్థాల తో పాటు ఇతర అంశాల మీద అవగాహన కల్పించాలన్నారు. గ్రామ స్థాయిలో ఇన్ఫర్మేషన్‌ వ్యవస్థ పటిష్టం చేసుకొని అసాం ఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిం చాలన్నారు. స్టేషన్ల పరిధిలో ప్రమాదాల నివారణకు ప్రతీ రోజు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు, వాహనల తనిఖీలు నిర్వహిం చాలని ఆదేశించారు. పాత నేరస్థుల కదలికలపై నిఘా పెడుతూ పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాల సూచించారు. బహిరంగ ప్రదేశా ల్లో మద్యం సేవించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్పీ వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు అశోక్‌, అంజయ్య, పోలీస్‌ స్టేషన్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 12:45 AM