కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు పకడ్బందీ చర్యలు
ABN , Publish Date - Mar 21 , 2025 | 12:59 AM
జిల్లాలో యాసంగి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానా యక్ ఆదేశించారు.

సిరిసిల్ల కలెక్టరేట్, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఖీమ్యానా యక్ ఆదేశించారు. రైతులు టోకెన్ పద్ధతిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్ర యించి ప్రభుత్వం అందించే మద్దతు ధర పొందాలని కోరారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో గురువారం యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సం బంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ మాట్లాడుతూ జిల్లాలో 2024-25 సీజన్‌లో 2.50లక్షల మె ట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనా ఉందని, కొనుగోళ్లకు అవసరమైన కేంద్రాల ఏర్పాటు జాబితాను సిద్ధం చేయాలని ఆదేశిం చారు. హార్వేస్టర్ల యజమానులతో సమావేశాన్ని నిర్వహించి టోకెన్ పద్ధతిన పం ట కోతలు జరిగి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం చేరుకునేలా చర్యలు తీసుకోవాల న్నారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా, వీధి లైట్లు, మిగతా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో పౌర సరఫరాల శాఖ మేనేజర్ రజిత, జిల్లా అధికారి వసంతలక్ష్మి, జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్, అదనపు డీఆర్‌డీవో శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.