Share News

Employee dues: బకాయిల చెల్లింపులపై ఎన్జీవో నేతల హర్షం

ABN , Publish Date - Mar 22 , 2025 | 05:42 AM

ఉద్యోగుల బకాయిల చెల్లింపు ఆదేశాలపై ఎన్జీఓ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రూ.6,200 కోట్ల విడుదలకు ఉత్తర్వులు ఇవ్వటం, వెంటనే అమలు చేయటం పట్ల రాష్ట్ర ఎన్జీఓ అధ్యక్షుడు, కె.వి.శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.విద్యాసాగర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, చీఫ్‌ సెక్రటరీ కె.విజయానంద్‌కు, సంబంధిత ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో త్వరలోనే పీఆర్సీ చైర్మన్‌ను కూడా నియమిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.

Employee dues: బకాయిల చెల్లింపులపై ఎన్జీవో నేతల హర్షం

ముఖ్యమంత్రికి, అధికారులకు ధన్యవాదాలు

గత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులకు గురిచేసిందని వెల్లడి

విజయవాడ(వన్‌టౌన్‌), మార్చి 21(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల బకాయిల చెల్లింపు ఆదేశాలపై ఎన్జీఓ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రూ.6,200 కోట్ల విడుదలకు ఉత్తర్వులు ఇవ్వటం, వెంటనే అమలు చేయటం పట్ల రాష్ట్ర ఎన్జీఓ అధ్యక్షుడు, కె.వి.శివారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.విద్యాసాగర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌, చీఫ్‌ సెక్రటరీ కె.విజయానంద్‌కు, సంబంధిత ఉన్నతాధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో త్వరలోనే పీఆర్సీ చైర్మన్‌ను కూడా నియమిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు పడిన ఇబ్బందులను ప్రస్తావించారు. సుమారు రూ.25 వేల కోట్ల బకాయిలను చెల్లించకుండా గత ప్రభుత్వం కాలయాపన చేసి ఆర్థిక ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బకాయిలు, ఇతర సమస్యలపై సీఎంకు వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేయటం హర్షణీయమని కృతజ్ఞతలు తెలిపారు.


ఇవి కూడా చదవండి:

Salary Hike: సీఎం సహా ఎమ్మెల్యేలందరికీ 100 శాతం వేతనాల పెంపు

Amit Shah: మెడికల్, ఇంజనీరింగ్ విద్యను తమిళంలో అందిస్తాం: అమిత్‌షా

MLAs: ఈ ఎమ్మెల్యేల సంపద తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

Updated Date - Mar 22 , 2025 | 05:42 AM

News Hub