Share News

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి..

ABN , Publish Date - Mar 21 , 2025 | 12:57 AM

యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర సింహారావు అన్నారు.

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి..

కోనరావుపేట, మార్చి 20 (ఆంధ్రజ్యోతి) : యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర సింహారావు అన్నారు. కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో సింగిల్‌ విండో డైరెక్టర్‌ పొట్లపల్లి సత్యనారాయణ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం జిల్లా స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను గురువారం ప్రారంభించి మాట్లాడారు. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు దేహదారుఢ్యం పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమం లో సెస్‌ వైస్‌చైర్మన్‌ దేవరకొండ తిరుపతి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మల్యా ల దేవయ్య, ప్యాక్స్‌ చైర్మన్లు బండ నర్సయ్య, రామ్మోహన్‌ రావు, మాజీ ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, మాజీ జెడ్పిటిసి చెన్నమనేని శ్రీకుమార్‌, ప్రజాప్రతినిధులు గోపు పరశురాములు, శ్రీనివాస్‌, గంగాధర్‌, వంశీ, మల్లేశం, గోపాల్‌ రావు, శివతేజ, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 12:57 AM