KTR: ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి రేవంత్
ABN , Publish Date - Apr 01 , 2025 | 05:53 AM
కేటీఆర్ ప్రభుత్వ భూములను అమ్మడం పై రేవంత్ రెడ్డి దృష్టిని సారించి, హెచ్‌సీయూలో విద్యార్థులు చేస్తున్న భూ పరిరక్షణ పోరాటానికి బీఆర్‌ఎస్ మద్దతు తెలుపుతామని చెప్పారు. విద్యార్థుల అరెస్టులు, చెట్లు నరికి భూములు కబ్జా చేసే చర్యలను కటకం చేశారు.

హెచ్‌సీయూ పోరాటానికి బీఆర్‌ఎస్ మద్దతు
ఇద్దరు విద్యార్థుల ఆచూకీని సర్కార్ బయటపెట్టాలి ఈ అంశంపై రాహుల్ స్పందించాలి: కేటీఆర్
హైదరాబాద్, మార్చి31 (ఆంధ్రజ్యోతి) : ‘‘నువ్వు ప్రతిపక్షంలో ఉన్నపుడు ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటే భవిష్యత్ తరాలకు స్మశానాలకు కూడా జాగలు ఉండవన్నావు కదా.. మరిప్పుడు ప్రభుత్వ భూములు అమ్ముతూ.. నువ్వు చేస్తున్నదేంటి రేవంత్‌రెడ్డీ’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న భూ పరిరక్షణ పోరాటానికి బీఆర్‌ఎస్ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిలుస్తుందని పేర్కొన్నారు. పలువురు హెచ్‌సీయూ సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి అక్కడి పరిస్థితులను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భూముల పరిరక్షణకు యూనివర్సిటీ విద్యార్థులు చూపుతున్న తెగువకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. హెచ్‌సీయూలో ఇద్దరు విద్యార్థులను అరెస్టుచేసి జైలుకు పంపినట్లు చెబుతున్నారని, వారి ఆచూకీని ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో హెచ్‌సీయూకు రెండు సార్లు వచ్చి వెళ్లిన రాహుల్‌గాంధీ.. ఇప్పుడు తాజా అంశంపైనా స్పందించాలని కోరారు. బీజేపీతోపాటు ఇతర రాజకీయ పార్టీలు తమ వైఖరిని వెల్లడించాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ మాజీ విద్యార్థులైన భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు... ఈ విషయమై ఎందుకు మాట్లాడడం లేదు? విద్యార్థుల తరఫున నిలబడేందుకు వారి మనసు రావడం లేదా? అని నిలదీశారు. ఫ్యూచర్ సిటీ, ఫార్మా సిటీల్లో 45,000ఎకరాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. 400 ఎకరాలపై ఎందుకింత దారుణంగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వందలాది బుల్డోజర్లతో అక్కడున్న చెట్లు, జంతువులను చంపి.. మరీ వేగంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. హెచ్‌సీయూ చుట్టూ ఉన్న పచ్చదనాన్ని కాపాడుకోగలిగితే భవిష్యత్తుకు భరోసా ఉంటుందని.. లేదంటే ఢిల్లీ మాదిరి ఊపిరి పీల్చుకోవడమే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
ఈ వార్తలు కూాడా చదవండి
Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది
HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన
Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..
Read Latest Telangana News And Telugu News