ఉపాధి కూలీలకు సౌకర్యాలు కరువు..
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:29 PM
జిల్లాలో అరకొర సౌకర్యాల నడుమ ఉపాధి హామీ పథకం పనులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులు గ త నెల 31వ తేదీ వరకు ముగియగా, ఈ నెల 1 నుంచి కొత్త సీజన్ పనులు చేపడుతున్నారు.

పని స్థలాల్లో కానరాని ఏర్పాట్లు
లక్ష్యం నెరవేరినా కూలీలకు తప్పని ఇబ్బందులు
తాగునీరు లేక ఎండలకు విలవిల్లాడుతున్న వైనం
మంచిర్యాల, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అరకొర సౌకర్యాల నడుమ ఉపాధి హామీ పథకం పనులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనులు గ త నెల 31వ తేదీ వరకు ముగియగా, ఈ నెల 1 నుంచి కొత్త సీజన్ పనులు చేపడుతున్నారు. వేసవి కాలంలో చేపట్టే ఉపాధి హామీ పనులకు సంబం దించి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. అడవులు, చెరువులు, కాలువల్లో పూడికతీత పనులు చేస్తున్న కూలీలు ఎండలకు విలవిల్లాడుతున్నారు. కూలీలు సేద తీరేందుకు కనీసం నీడ ఏర్పాట్లు కూ డా చేయలేదు. పనుల వద్ద కనీసం తాగునీటి సౌక ర్యం లేదంటే అతశయోక్తికాదు.
లక్ష్యాన్ని అధిగమించి...
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జి ల్లాలో లక్షా 20వేల 854 కుటుంబాలకు జాబ్ కార్డు లు ఉండగా, 2,36,818 మంది ఉపాధి కూలీలు ఉ న్నారు. వీరికి డైలీ వేజెస్ కింద సవరించిన వేతనం ప్రకారం రూ. 300 చొప్పున చెల్లిస్తున్నారు. కూలీలకు పనులు కల్పించేందుకు గాను 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 30 లక్షల పని దినాలు లక్ష్యం గా పెట్టుకోగా, ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సా గడంతో గడువు ముగిసే సరికి 31 లక్షల పనిదినాలు పూర్తిచేసి, 103.51 శాతం నమోదు చేశారు. జిల్లాలో కేవలం 82,004 కుటుంబాల్లోని 1,29,676 మంది కూ లీలకు మాత్రమే పనులు కల్పించారు. వీరిలో కేవ లం 3884 కుటుంబాలకు మాత్రమే 100 రోజుల పనిదినాలను కల్పించారు. కాగా ఉపాధి పనులకు రో జువారీ వేతనం రూ. 300 చెల్లిస్తున్నప్పటికీ, గతంలో కంటే ఉపాధి పనుల వైపే కూలీలు మొగ్గు చూపుతున్నారు.
భత్యాలు అందక ఇబ్బందులు.....
ఉపాధి హామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించడంతో కూలీలకు కొంతమే ర ఊరట లభిస్తుందనే చెప్పవచ్చు. వేతనాలు కనీ సం 4 నుంచి 10 శాతం మేర పెరిగాయి. సవరించి న లెక్కల ప్రకారం...నైపుణ్యం లేని (అన్ స్కిల్డ్) కా ర్మికులకు ఈ పథకం కింద చెల్లించే రోజువారీ వే తనం రాష్ట్రంలో రూ. 307 చెల్లిస్తున్నారు. ఇదిలా ఉం డగా కేంద్ర ప్రభుత్వం వేసవి భత్యం నిలిపి వేయ డంతో కూలీల్లో ఆందోళన నెలకొంది. మండు టెండ ల్లో పనిచేసే వారికి గతంలో ఉన్న కొన్ని సౌకర్యాల ను తొలగించడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఉపాధి హామీ పనులు వేసవిలోనే పూర్తిస్థాయిలో జ రుగుతుంటాయి. అధిక ఉష్ణోగ్రతలతో కూలీలు ఇ బ్బందులు పడుతుంటారు. ఎండ నుంచి వారిని ర క్షించేందుకు మంచినీటి సరఫరా, షేడ్ నెట్లు సమ కూర్చుకునేందుకు గాను కొంత మొత్తం చెల్లించేవా రు. అలాగే వేసవిలో పనులు చేసినందుకు గాను 30 శాతం అదనపు భత్యాన్ని చెల్లించే విధానం ఉండేది. కూలీలకు ప్రయాణ, కరువు భత్యం (టీఏ, డీఏ), ఖ ర్చు కింద గడ్డపారికు రూ. 10, తట్టకు రూ. 5, మం చినీటికి రూ. 5 చెల్లిస్తుండేవారు. అలాగే అయిదు కిలోమీటర్లకు పైగా దూరం నుంచి వచ్చే వారికి ప్ర త్యేకంగా రూ. 20 చొప్పుల చెల్లించాల్సి ఉంది. భత్యం తోపాటు పని ప్రదేశంలో విశ్రాంతి తీసుకునేందుకు టెంట్ సౌకర్యం కల్పించాలి. మార్చి ఒకటవ తేదీ నుంచి వేసవిగా పరిగణించి పై భత్యాలు చెల్లిం చ డంతోపాటు పై ఖర్చులు అమలు చేయాల్సి ఉండ గా, కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేయగా, భ త్యాల చెల్లింపునకు అందులో చోటు కల్పించలేదు. దీంతో కూలీలలకు భత్యాలు అందకపోగా మెడికల్ కిట్లు, నెట్లు కూడా సమకూర్చడం లేదు.
లక్ష్యం మేరకు పనులు కల్పిస్తున్నాం
డీఆర్డీవో కిషన్
ఉపాధి హామీ పథకంలో భాగంగా లక్ష్యం మేరకు పనులు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. జాబ్ కార్డు కలిగిన కూలీలకు నిర్దేశిత లక్ష్యం ప్రకారం ఉపాధి క ల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమ లు చేస్తున్నాం. మంచినీటి సౌకర్యం కూలీలే తెచ్చు కుంటుండగా, గ్రామ పంచాయతీలు కూడా సమకూ రుస్తున్నాయి. ప్రస్తుతం ఎండల కారణంగా కూలీ లు తెల్లవారుజామునే పని స్థలాలకు వెళ్లి నిర్ణీత కూ లీ గిట్టుబాటయ్యే వరకు పనులు చేస్తుండటంతో ల క్ష్యాన్ని అధిగమించాము.