భగత్‌సింగ్ ఆశయాలు కొనసాగించాలి
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:46 PM
భగత్‌సింగ్ ఆశయాలను కొనసాగించాలని మాస్‌లైన్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు.

పాలమూరు, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : భగత్‌సింగ్ ఆశయాలను కొనసాగించాలని మాస్‌లైన్ డివిజన్ కార్యదర్శి వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించి వారు చేసిన త్యాగాలు గుర్తు చేసుకున్నారు. నూతన సమాజ స్థాపనకు అతిచిన్న వయస్సులో భగత్‌సింగ్ ఉరి కంబాన్ని ముద్దాడని కొనియాడారు. టీయూసీఐ నాయకులు గణేష్, డాక్టర్ కర్క గణేష్, బాలు, బాలు, సతీష్, బుజ్జి, రాము, సాయిలు పాల్గొన్నారు.రాజేంద్రనగర్‌లో ప్రజాస్వామిక వాదులు, ప్రజా సంఘాల నాయకులు నివాళి అర్పించారు. యం.రాఘవాచారి, ఎస్.ఎం ఖలీల్, శ్రీదేవి, మణ్యంకొండ, కోటి సుభాష్, శ్రీశైలం, వెంకటేష్, వామన్‌కుమార్, సతీష్, సృజన, విజయకుమార్, తిమ్మప్ప, సయ్యద్, సైదద్దీన్, కేసీ వెంకటేశ్వర్లు, వెంకటేష్, ఖాజామైనద్దీన్ పాల్గొన్నారు.
జడ్చర్ల : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన గొప్ప వీరుడు భగత్‌సింగ్ అని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు అన్నారు. జడ్చర్ల పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఆదివారం భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అంతకుముందు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. సీపీఎం నాయకులు జగన్, జయరాములు, జంగయ్య, యాదయ్య, సాయిలు, శ్యాంసుందర్, రమేశ్, మహేష్, ప్రసాద్, నాగయ్య, శ్రీశైలం, కార్తీక్ పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ న్యూటౌన్/మహ్మదాబాద్ : మహ్మదాబాద్ మండల కేంద్రంలోని భగత్‌సింగ్ విగ్రహ వద్ద కార్మిక, రైతు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు పూలమాల వేసి నివాళి అర్పించారు. అఖిలభారత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ విగ్రహం నుంచి విద్యార్థులతో క్లాక్‌టవర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో భగత్‌సింగ్ చిత్రపటానికి నివాళి అర్పించారు. కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కురుమయ్య, వ్యవసాయ కార్యిక సంఘం మండల కార్యదర్శి రాములు, వెంకటయ్య, చెన్నయ్య, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రవికుమార్, ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా ఉపాధ్యక్షురాలు ఉమాదేవి, హేమంత్, కిష్ట్యానాయక్, జయంతి, శివరాజ్, శంకర్‌నాయక్, ఎంవీఎస్ డిగ్రీకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్య, శృశ్రత వైద్యశాల డాక్టర్ మధుసూదన్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అఽధ్యక్ష, కార్యదర్శులు ప్రశాంత్, భరత్, నందు, శ్రీనాథ్, సాయి, నగేష్ పాల్గొన్నారు.