స్కిల్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:44 PM
నిరుద్యోగుల కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో పట్టణంలో స్కిల్ డెవలప్‌మెంట్ టా స్క్ సెంటర్ ఏర్పాటు కానున్నదని రత్నగిరి ఫౌం డేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ పేర్కొన్నారు.

- పరిశీలించిన రాష్ట్ర ప్రతినిధులు
కొల్లాపూర్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : నిరుద్యోగుల కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు చొరవతో పట్టణంలో స్కిల్ డెవలప్‌మెంట్ టా స్క్ సెంటర్ ఏర్పాటు కానున్నదని రత్నగిరి ఫౌం డేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్‌కు చెందిన రాష్ట్ర ప్రతినిధులు పట్ట ణంలో వాటి ఏర్పాటుకు కావాల్సిన వసతుల కోసం భవనాలను పరిశీలించారు. పట్టణంలోని పీజీ కళాశాల, మినీ స్టేడియంలోని హాల్‌లను చూశారు. ప్రభుత్వం ప్రకటించే అన్ని పోటీ పరీ క్షలకు స్కిల్‌ను పెంచే కోర్సులపై నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు ధర్మతేజ తెలిపారు. కార్య క్రమంలో టాస్క్ రీజినల్ సెంటర్ హెడ్ నవీన్ రెడ్డి, రిలేషన్ షిప్ మేనేజర్ సిరాజ్, టాస్క్ ప్రతి నిధి దిడ్డి భాస్కర్, మంత్రి కార్యాలయ అధికా రులు కృష్నయ్య, నాగరాజు, పీజీ కళాశాల ప్రిన్సి పాల్ మార్క్‌పోలోనియస్, టాస్క్ సభ్యులు వెంకటేశ్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.