ఆశా కార్యకర్తలపై నిర్బంధం దారుణం
ABN , Publish Date - Mar 25 , 2025 | 11:27 PM
ప్రజాపాలనలో ఆశా కార్యకర్తలపై నిర్భంధం దారుణమని ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి అన్నారు.

- ఆశాల ధర్నాలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి
- నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన
నారాయణపేట/నారాయణపేట రూరల్/మాగనూరు/కోస్గి రూరల్/ ధన్వాడ/మక్తల్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలనలో ఆశా కార్యకర్తలపై నిర్భంధం దారుణమని ఆశా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బాలమణి అన్నారు. మంగళవారం నారాయణపేట అంబేడ్కర్ చౌరస్తాలో ఆశాలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాలమణి మా ట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలో భాగంగా కనీస వేతనం రూ.18 వే లు అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల వేదిక జిల్లా కార్యదర్శి కాశప్ప, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పవన్‌కుమార్, నిర్మల, లక్ష్మీ, శివమ్మ, నర్సమ్మ, రాధిక, మహేశ్వరి, లక్ష్మీ, నాగమణి, నర్మద తదితరులున్నారు.
అదేవిధంగా, నారాయణపేట మండలం కోట కొండ గ్రామంలో ఆశా వర్కర్లు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు రాధిక మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తమ డిమాండ్లను తెలిపేందుకు శాంతియుతంగా నిరసన చేసే హక్కు తమకు లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆశా వర్కర్లు రాధిక, భాగ్య, పద్మ, అంజమ్మ, నరసమ్మ, కృష్ణవేణి, కల్పన, జయమ్మ, వెంకటేశ్వరి, రేణుకలు పాల్గొన్నారు.
మాగనూరు మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై ఆశా వర్కర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు మాట్లాడుతూ ఈనెల 27లోగా రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఆశ వర్కర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే వారు చేపట్టే కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ఆందోళనల్లో పాల్గొంటామని పేర్కొన్నారు. కార్య క్రమంలో సీపీఎం నాయకుడు భరత్‌కుమార్, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు కే.నర్సింహులు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు నయూం, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గౌరమ్మ, శాంతమ్మ, సత్యమ్మ, పారిజాత, అనిత, అనంతమ్మ, అనురాధ, పద్మ తదితరులున్నారు.
గుండుమాల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆశా కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తహసీల్దార్ భాస్కరస్వామికి వినతిపత్రం అందించారు. ఆశ కార్యకర్తలు స్వాతి, సాయమ్మ, లక్ష్మీ, జరీనా, వీరమణి, చంద్రకళ, వసంత, పరమేశ్వరి తదితరులున్నారు.
ధన్వాడలో ఆశా వర్కర్లు నల్లబ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాల్‌రాం, విజయలక్ష్మీ, అనురాధ, చంద్రకళ, భాగ్య, మాసమ్మ, అంజిలమణి, లక్ష్మీ ఉన్నారు.
మక్తల్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో ఆశా వర్కర్లు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గో విందరాజు, వర్కర్లు యశోద, సుజాత, అమీనా బేగం, ఇందిర, వెంకటమ్మ, అనురాధ, అనిత, లక్ష్మీ, పార్వతమ్మ, రహీదాబేగం, సంతోష, రేణుక, పద్మ, సావిత్రమ్మ, బాలమ్మ, అనురాధ, విజయలక్ష్మీ పాల్గొన్నారు.