Share News

పేదింటి ఆడపడుచులకు అండగా సీఎం

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:25 PM

పేదింటి ఆడపడుచులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

పేదింటి ఆడపడుచులకు అండగా సీఎం

- కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే బండ్ల

గద్వాలన్యూటౌన్‌, మార్చి 23(ఆంధ్రజ్యోతి): పేదింటి ఆడపడుచులకు అండగా నిలిచిన నాయకుడు సీఎం రేవంత్‌రెడ్డి అని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం గద్వాల నియోజకవర్గంలోని అన్ని మండలాలతో పాటు గద్వాల పట్టణానికి సంబంధించిన 900 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. చెక్కులు రావని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. దీన్ని ఎవరూ నమ్మవద్దని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, జిల్లా సీనియర్‌నాయకులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:25 PM