Share News

ప్రతీ ఒక్కరికి సన్న బియ్యం అందించాలి

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:22 PM

రేషన్‌కార్డు ఉన్న ప్రతీ లబ్ధిదారుడికి నాణ్యమైన సన్న బియ్యం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలం అన్నారు.

ప్రతీ ఒక్కరికి సన్న బియ్యం అందించాలి
కృష్ణలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ బెన్‌షాలం

- రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలం

కృష్ణ/మద్దూర్‌/కోస్గి/ మాగనూరు/కోస్గి రూరల్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రేషన్‌కార్డు ఉన్న ప్రతీ లబ్ధిదారుడికి నాణ్యమైన సన్న బియ్యం అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం అని రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలం అన్నారు. మం డల కేంద్రంలోని రేషన్‌ దు కాణంలో బుధవారం సన్న రకం బియ్యాన్ని ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేసి, మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల పేద ప్రజలు మూడు పూటల కడుపు నిండా భోజనం చేసేందుకు ప్రభుత్వం నాణ్యమైన సన్న బి య్యం అందజేస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ వెంకటేష్‌, మదన్‌మోహన్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు, డీలర్‌ శ్రీనివాస్‌, స్థానిక ప్రజాప్రతినిధులు రాజప్పగౌడ్‌, ఆసిఫ్‌, షారూఖ్‌, సురేష్‌, సిద్రాం, నాగేంద్రం, వీరేష్‌ ఉన్నారు.

అదేవిధంగా, మద్దూర్‌ మండల కేంద్రంతో పాటు, మండలంలోని దోరేపల్లి, ఖాజీపూర్‌ గ్రామాల్లో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భీములు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, ఎంపీపీ సంజీవుతో కలిసి జిల్లా పౌర సరఫరాల శాఖ జిల్లా డీఎం సైదులు, పీఏసీఎస్‌ అఽధ్యక్షుడు న ర్సింహా సన్న బియ్యం పథకాన్ని బుధవారం ప్రారంభించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ ఆనంద్‌ మాట్లాడుతూ రేషన్‌ బియ్యం అమ్ముకుంటే కా ర్డులు రద్దు చేస్తామని హెచ్చరించారు. కార్యక్ర మంలో తహసీల్దార్‌ మహేష్‌గౌడ్‌, ఎంపీడీవో నర్సింహారెడ్డి, భీములు, నర్సింహ, రఘుపతిరెడ్డి, సంజీవ్‌, రహీం, మల్లికార్జున్‌, జనార్ధన్‌గౌడ్‌, రామన్నతో పాటు ఆయా గ్రామాల రేషన్‌ డీల ర్లు పాల్గొన్నారు.

కోస్గి పట్టణంలోని 7వ నంబర్‌ రేషన్‌ షాప్‌లో ఆర్డీవో రాంచందర్‌నాయక్‌ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. ప్రభుత్వం నిర్ధేశించిన తేదీ వరకు లబ్ధిదారు లకు ఈ పథకం ద్వారా వారి కోటానుసారం సన్న బియ్యం అందించాలని డీలర్లను ఆదేశిం చారు. తహసీల్దార్‌ శ్రీనివాసులు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్‌ రెడ్డి, మునిసి పల్‌ అధ్యక్షుడు బెజ్జు రాములుతో పాటు రేషన్‌ డీలర్లు పాల్గొన్నారు.

మాగనూరు మండల కేంద్రంలోని రేషన్‌ షాపు-1లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని డీఎస్‌వో బాలరాజు ప్రారంభించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్‌, తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌, సివిల్‌ సప్లై డీటీ గురురాజా రావు, ఆర్‌ఐ శ్రీశైలం, రేషన్‌ దుకాణాల సంఘం మాగనూరు మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, మక్త ల్‌ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ శంకర్‌లింగం, కాం గ్రెస్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు, డీ లర్లు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

గుండుమాల్‌ మండల కేంధ్రంలో రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ కార్య క్రమాన్ని కోస్గి ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ మధుకర్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ గుండుమాల్‌ మం డల అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి బుధవారం ప్రారం భించారు. తహసీల్దార్‌ భాస్కరస్వామి, నాయకు లు, రేషన్‌ డీలర్‌ బాల్‌రాజ్‌ తదితరులున్నారు.

Updated Date - Apr 02 , 2025 | 11:22 PM