రోడ్డు ట్యాక్స్ చెల్లించకుంటే ఫైన్
ABN , Publish Date - Mar 24 , 2025 | 12:00 AM
జిల్లాలో పెండింగ్ రోడ్ ట్యాక్స్ వసూలుపై జిల్లా రవాణాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది.

- రవాణా వాహనాలపై 200 శాతం అపరాధ రుసుము
- ఈనెల చివరి వరకు స్పెషల్ డ్రైవ్
- ఫిట్‌నెస్, పర్మిట్ , పొల్యూషన్, బీమా లేకుంటే జరిమానా
- జిల్లా వ్యాప్తంగా పన్నులు చెల్లించని వాహనాలు 6,042
వనపర్తి క్రైం, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెండింగ్ రోడ్ ట్యాక్స్ వసూలుపై జిల్లా రవాణాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. వాహన దారులు సొంతంగా రోడ్ ట్యాక్స్ చెల్లిస్తే సరే.. లేదంటే అంతే సంగతులు. రవాణా శాఖ అధికారుల తనిఖీల్లో పట్టుబడితే 200 శాతం ఫైన్ విధించనున్నారు. జిల్లాలో వేల సంఖ్యలో రవాణా వాహనాలు ఏళ్ల తరబడి ట్యాక్స్ చెల్లిం చకుండా తప్పించుకు తిప్పుతున్నట్లు గుర్తించా రు. బకాయిలను వసూలు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌కు సిద్ధమైంది. అంతేకాదు ఆయా వాహనా ల ఫిట్‌నెస్, పర్మిట్, పొల్యూషన్, ఇన్సూరెన్స్, లైసెన్స్ వంటివి లేకున్నా జరిమానా తప్పదు.
జిల్లా వ్యాప్తంగా ట్యాక్సీ చెల్లించని వాహనాలు
జిల్లాలో వివిధ కేటగిరీలకు చెందిన ట్యాక్స్ చెల్లించని వాహనాలు 6,042 ఉన్నాయి. ఇందు లో స్కూల్ బస్సులు 82, హార్వెస్టర్స్ 302, లారీలు 529, గూడ్స్ క్యారేజీ 1,285 , ట్రావెలింగ్ వాహనాలు 114, ట్యాక్స్ ప్లేట్ మోటర్ క్యాబ్స్ 65, ట్రాక్టర్, ట్రాలీ (కమర్షియల్ యూజ్) 2,599, ట్రాక్టర్ లోడర్స్ 145 ఉన్నాయి. ఈ వాహనాలకు గత కొంతకాలంగా యజమానులు రోడ్ ట్యాక్స్ చెల్లించడం లేదు. జిల్లాలో రవాణా వాహనాలకు సంబంధించి రోడ్ ట్యాక్స్ రూ.7 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు 10 రోజుల పాటు స్పెష ల్ డ్రైవ్ నిర్వహించి పన్నులు వసూలు చేసేం దుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
ఈనెల చివరి వరకు స్పెషల్ డ్రైవ్
వాహనదారులు తమ వాహనాలకు సంబంధించి రోడ్డు ట్యాక్స్, ఇతర పన్నులు వెంటనే చెల్లించాలి. ఈ నెల చివరి వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. స్పెషల్‌డ్రైవ్‌లో పట్టుబడితే 200 శాతం జరిమానాతో వసూలు చేస్తాం.
- మానస, జిల్లా రవాణా శాఖ అధికారి