Share News

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:59 PM

అర్హు లందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

- ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

కోడేరు/కొల్లాపూర్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): అర్హు లందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని రాష్ట్ర ఎక్సైజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కోడేరు మం డలంలోని బాడుగదిన్నె గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ముఖాముఖి కార్య క్రమాన్ని ఏర్పాటు చేశారు. సీసీరోడ్లు, డ్రైనేజీల కోసం పది నుంచి 20 లక్షల వరకు కేటాయిస్తామన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ల్లతో పాటు రేషన్‌కార్డులు ఇస్తామ న్నారు. గ్రామంలో తాగునీటి సమస్య, రైతులకు పూర్తి స్థాయి లో రుణ మాిఫీ కాలేదని మం త్రి దృష్టికి తెచ్చారు. సంబంధి త అధికారులతో మాట్లాడి అర్హు లందరికీ రుణమాఫీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా కొల్లాపూర్‌ పట్టణం, మండలంలోని మృతుల కుటుం బాలను పరమార్శించి మృతదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కొల్లాపూర్‌ పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ప్రజల నుంచి వినతులను స్వీకరిం చారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ కొత్త రామ్మో హన్‌రావు, కాంగ్రెస్‌ పార్టీ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:59 PM