Share News

రాజీవ్‌ వికాసానికి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు తీసుకోవాలి

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:32 PM

జిల్లా లో అర్హులైన వారి నుంచి రాజీవ్‌ యువ వికాసం పథకానికి నేరు గా (ఆఫ్‌లైన్‌లో) కూడా దరఖా స్తులు తీసుకోవాలని అదనపు క లెక్టర్‌ స్థానిక సంస్థలు యాద య్య తెలిపారు.

రాజీవ్‌ వికాసానికి ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు తీసుకోవాలి

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లా లో అర్హులైన వారి నుంచి రాజీవ్‌ యువ వికాసం పథకానికి నేరు గా (ఆఫ్‌లైన్‌లో) కూడా దరఖా స్తులు తీసుకోవాలని అదనపు క లెక్టర్‌ స్థానిక సంస్థలు యాద య్య తెలిపారు. బుధవారం అద నపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) చాంబర్‌లో రాజీవ్‌ యువ వికా సం పథకానికి సంబంధించి జి ల్లాస్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ప థకానికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు, ఇ తర విధివిధానాల గురించి కమిటీ సమావేశం లో చర్చించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ ర్గాలు (ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, బౌద్ధ, జైన్‌, పార్శి)లకు చెందిన నిరుద్యోగ యువత, ఇత రులకు ఉపాధి అవకాశాలు క ల్పించడం ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రా ష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ యువ వి కాసం పథకాన్ని ప్రకటించిందని తెలిపారు. రాజీవ్‌ యువ వికా సం పథకానికి సంబంధించి దర ఖాస్తు గడువును ప్రభుత్వం ఏ ప్రిల్‌ 14వ తేదీ వరకు పొడి గించిందన్నారు. సమావేశంలో డీఆర్‌డీవో ఉ మాదేవి, జిల్లా ఉద్యానశాఖ అధికారి అక్బర్‌, మై నార్టీ సంక్షేమ శాఖ అధికారి అప్జలుద్దీన్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మల్లికార్జున్‌, మునిసిపల్‌ క మిషనర్‌ వెంకటేశ్వ ర్లు, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, ఇతర అధికారులు తదితరులు పా ల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2025 | 11:32 PM