Share News

walking formula: ఈజీగా బరువు తగ్గాలనుందా.. 5-4-5 వాకింగ్ ఫార్ములా ట్రై చేయండి..

ABN , Publish Date - Apr 05 , 2025 | 11:08 AM

Walking formula for weight loss: అధిక బరువు సమస్య మిమ్మల్ని వేధిస్తోందా.. త్వరగా బరువు తగ్గడమే మీ లక్ష్యమా.. ఇందుకోసం వివిధ రకాల పద్ధతులు ట్రై చేసి విసిగిపోయారా.. అయితే, 5-4-5 వాకింగ్ ఫార్ములా అనుసరించి చూడండి. కొద్ది రోజుల్లోనే తేడా మీకే తెలుస్తుంది.

walking formula: ఈజీగా బరువు తగ్గాలనుందా.. 5-4-5 వాకింగ్ ఫార్ములా ట్రై చేయండి..
5-4-5 Walking Formula

Health benefits of the 5-4-5 walking formula: శరీరం ఫిట్‌గా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ బరువు ఉంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి ప్రజలు కఠినమైన వర్కవుట్లు, ప్రత్యేక డైట్ పాటిస్తుంటారు. ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా కష్టపడుతుంటారు. కానీ మీరు ఎప్పుడైనా 5-4-5 వాకింగ్ ఫార్ములా గురించి విన్నారా? ఈ ఫార్ములా పాటిస్తే బరువు వేగంగా తగ్గుతారు. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి నియంత్రణ సహా ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇంతకీ, 5-4-5 నడక ఫార్ములా అంటే ఏమిటి? ఎలా చేయాలి? దీన్ని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.


5-4-5 వాకింగ్ ఫార్ములా అంటే ఏమిటి?

5 నిమిషాల పరుగు: 5-4-5 సూత్రంలోని మొదటి సంఖ్య ప్రకారం మీరు దినచర్యను 5 నిమిషాల పరుగుతో ప్రారంభించాలి. ఇలా చేస్తే హృదయ స్పందన రేటు పెరిగి జీవక్రియ మెరుగవుతుంది. 5 నిమిషాల పరుగుకే శరీరంలో రక్త ప్రసరణను వేగవంతం అవుతుంది. తద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. శక్తి పెరుగుతుంది. కండరాలను బలపడతాయి.

4 నిమిషాల నడక: ఐదు నిమిషాలు పరిగెత్తిన తర్వాత చేయాల్సిన పని కేవలం 4 నిమిషాలు నడక. ఈ పద్ధతి శ్వాసను నియంత్రించడంలో సహాయపడుతుంది. నడక కండరాల అలసటను తగ్గించి తదుపరి దశకు ముందుగా కొంత విశ్రాంతిని అందిస్తుంది.

5 నిమిషాల చురుకైన నడక: ఫార్ములాలో చివరి దశ 5 నిమిషాల స్పీడ్ వాకింగ్. ఈ దశ శక్తిని మెరుగుపరచడానికి, కాళ్ళ కండరాలను బలోపేతం చేయడానికి, హృదయనాళ సామర్థ్యాన్ని పెంచడానికి చాలా ఉపయోగపడుతుంది. స్పీడ్ వాకింగ్ ఆరోగ్యానికి గేమ్-ఛేంజర్ లాంటిది. కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండానే ఇలా ఎక్కువ కేలరీలను కరిగించుకోవచ్చు.


రోజుకు ఎన్ని గంటలు చేయాలి?

5-4-5 నడక ఫార్ములా రోజుకు కనీసం మూడు సార్లు దాదాపు 45 నిమిషాలు చేయాలి. రోజుకు రెండుసార్లు అంటే 30 నిమిషాలు చేసినా సరిపోతుంది. ప్రారంభంలో ఒకటి లేదా రెండు సార్లు చేయడం ప్రారంభించి క్రమంగా సమయాన్ని పెంచడం ఉత్తమం.


ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

5-4-5 నడక ఫార్ములా కేలరీలను బర్న్ చేయడమే కాకుండా మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పరుగు, తీరికగా నడవడం, చురుకైన నడక హృదయనాళాల పనితీరును మెరుగుపర్చి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ రకమైన నడక శరీరం నుండి ఎండార్ఫిన్‌లను విడుదల చేసి ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంపై అదనపు ఒత్తిడిని కలిగించకుండానే కండరాలు సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.


Read Also: Glowing Skin Tips: ఫేస్ వాష్ చేసేటప్పుడు చాలామంది చేసే మిస్టేక్స్ ఇవే.. ఈ పద్ధతులే సరైనవి..

White Hair Treatment: తెల్లజుట్టు సమస్య వేధిస్తోందా.. ఈ నూనె ట్రై చేయండి..

Curd after lunch: ప్రతిరోజూ భోజనం తర్వాత పెరుగు తింటే.. శరీరాన్ని ఎలా ప్రభావితం

Updated Date - Apr 05 , 2025 | 11:09 AM