తాగునీటికి ఖాళీ బిందెలతో నిరసన
ABN , Publish Date - Mar 23 , 2025 | 11:54 PM
పట్టణంలోని 1వ వార్డు రాంనగర్ కాలనీలో తా గునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ప్రజలు ఆదివారం అమరచింత ప్రధా న రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన చేపట్టా రు.

అమరచింత, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : పట్టణంలోని 1వ వార్డు రాంనగర్ కాలనీలో తా గునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ప్రజలు ఆదివారం అమరచింత ప్రధా న రహదారిపై ఖాళీ బిందెలతో నిరసన చేపట్టా రు. ఈ సందర్భంగా ర్యాలీగా వచ్చిన కాలనీవా సులు రాజీవ్ చౌరస్తాలోని మరికల్, ఆత్మకూరు ప్రధాన రహదారిపై బైఠాయిచారు. దాదాపు గం ట పాటు జరిగిన నిరసనలో పలువురు రాజకీ య నాయకులు పాల్గొని మాట్లాడారు. గత ఆ రు నెలలుగా 1వ వార్డు రాంనగర్ తదితర ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొందని విమర్శించా రు. వేసవికాలం ప్రారంభంలోనే తాగునీటి స మస్య ప్రజలకు తీవ్రతరమైందని అన్నారు. అనే కసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన లాభం లేకపోవడంతో నిరసన చేపడుతున్నట్లు తెలిపా రు. కార్యక్రమంలో నాయకులు వెంకటేష్, రా ము, రాకేష్ శెట్టి, వెంకటేష్, రాములు, మహ మూద్, నాగన్న, మహబూదా తదితరులు పా ల్గొన్నారు.