భక్తి శ్రద్ధలతో రంజాన్
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:29 PM
రంజాన్ ఉపవాస దీక్షలు సోమవారంతో ముగిశాయి.

ఆత్మకూరులో ఈద్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు
రంజాన్ ఉపవాస దీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ముస్లింలు రంజాన్ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాల్లోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంత్రి, ఎమ్మెల్యేలు ఈద్గాల వద్దకు చేరుకొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కొల్లాపూర్ పట్టణంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తిలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, నాయకులు ఈద్గాల వద్దకు చేరుకొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
- ఆంధ్రజ్యోతి, నెట్‌వర్క్