లేఅవుట్ అనుమతి కోసం స్థల పరిశీలన
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:15 PM
మునిసిపాలిటీలో లేఅవుట్ అనుమతి కోసం స్థలాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పరిశీలించారు.

కోస్గి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీలో లేఅవుట్ అనుమతి కోసం స్థలాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పరిశీలించారు. శుక్రవారం మునిసిపాలిటీ పరిధిలోని పరంచెరువు సమీపంలో నూతనంగా లేఅవుట్ ఏర్పాటు చేసుకునేందుకు పలువురు అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్, సర్వేయర్, మునిసిపల్ కమిషనర్‌తో కలిసి ఆయన స్థలాన్ని పరిశీలించారు. స్థలాన్ని పూర్తిగా సర్వేచేసి హద్దులు నిర్ణయించి రిపోర్టు ఇవ్వాలని సర్వేయర్‌ను ఆదేశించారు. ఇక్కడ ఏ మైనా ప్రభుత్వ స్థలం ఉంటే చూసుకోవాలని తహసీల్దార్‌కు సూచించారు. చెరువు పక్కన కాలువలు, ఎఫ్‌టీఎల్ బఫర్‌జోన్ ఉంటే చూసుకొని నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. ఎక్కడ ఏమాత్రం తప్పు జరిగినా సంబంధిత అధికారులదే బాధ్యత అని హె చ్చరించారు.
అల్పాహారం నాణ్యతపై ఆరా..
మద్దూర్ : విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అన్నారు. శుక్రవారం మద్దూర్‌లోని బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు హెచ్‌ఆర్, హెచ్‌కే ఆధ్వర్యంలో సరఫరా చేస్తున్న అల్పాహారాన్ని పరిశీలించి, నాణ్యత గురించి ఆరా తీశారు. అనంతరం పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఉపాధ్యాయులనడిగి తెలుసుకున్నారు. ఎంఈవో బాలకిష్టప్ప, హెచ్‌ఎం సబిత, ఉపాధ్యాయులు బాలాజీ, రఘు, యశ్వంత్, వసంత్‌కుమార్, సూర్యప్రకాశ్, వనజ, విజయలక్ష్మి, ప్రసన్నలక్ష్మి, రవి, సుధాకర్, ఆంజనేయులు, ప్రవీణ్ నవీన్, సత్యం తదితరులున్నారు. లు పాల్గొన్నారు.