Share News

నేటి నుంచి పది పరీక్షలు

ABN , Publish Date - Mar 20 , 2025 | 11:32 PM

పదో తగరతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

నేటి నుంచి పది పరీక్షలు
నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పరీక్ష కేంద్రంలో హాల్‌ టికెట్‌ నెంబర్లు వేస్తున్న అధికారులు

- ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

- విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అర గంట ముందే చేరుకోవాలి : డీఈవో

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/దోమలపెంట/ కల్వకుర్తి/ వనపర్తి రూరల్‌/ గద్వాల సర్కిల్‌, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పదో తగరతి వార్షిక పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా వ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో 60 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిచనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు మొత్తం 10,598 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో రెగ్యులర్‌ విద్యార్థులు 10,553 మంది ఉండగా 45 మంది ప్రవేటు విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గెర్యులర్‌ విద్యార్థుల్లో 5,242 మంది బాలురు ఉండగా 5,311 మంది బాలికలు ఉన్నారు. పది పరీక్షల నిర్వాహణకు మొత్తం 590 మంది ఇన్విజిలేటర్లు, 60 మంది సూపరింటెండెంట్లు, 60 మంది డిపార్టుమెంటల్‌ అధికారులను నియమించారు. అదేవిధం గా మాస్‌కాపీయింగ్‌కు తావు ఇవ్వకుండా జిల్లా వ్యాప్తం గా 4 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించారు. నేటి నుంచి ఏప్రిల్‌ 4 వరకు జరుగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు నిర్దేశించిన తేదీల్లో పరీక్ష కేంద్రాల పరిధిలో జిరాక్స్‌ సెంటర్లు మూసి ఉంచనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచా మని జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్‌ తెలిపారు. విద్యా ర్థులను పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని సూచించారు. గురువారం కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నిర్మల విద్యాలయంలో ఏర్పాట్లను డీఈవో రమేష్‌కుమార్‌ పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్‌ ఫోన్‌లు, ఎలక్ర్టానిక్‌ పరికరాలకు అనుమతి లేదని, హాల్‌ టికెట్‌, పరీక్ష ప్యాడ్‌, పెన్ను, పెన్సిల్‌ స్కేలు కు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. వనపర్తి జిల్లాలో 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 6,853 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. పరీక్షల నిర్వహణ కోసం 36 మంది చీఫ్‌ సూపరింటెండెం ట్లు, రెండు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 36 మంది డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, 400 పైగా ఇన్విజిలేటర్లను నియమించారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 40 పరీక్షా కేంద్రాల్లో 7,717 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 40 మంది సీఎస్‌, 40 డీవోలు, 40 మంది సిట్టింగ్‌ స్క్వాడ్స్‌, 431 ఇన్విజిటిలేటర్స్‌, ఇతర అధికారులు విధులు నిర్వహించనున్నారు.

పది పరీక్షలు సజావుగా జరగాలి

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

దోమలపెంట, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సజావుగా సాగేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ట్లు కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నా రు. గురువారం దోమలపెంట ఎస్‌ఎల్‌బీసీ వద్ద ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌తో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్ర వారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. విద్యార్థులు ఆందో ళనకు గురికాకుండా ప్రశాంత వాతావర ణంలో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం ఎస్పీ వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల పరిసరాలలో జిరాక్స్‌ సెంటర్లు మూసి వేయాలని సూచించారు. పరీక్ష కేంద్రాల చుట్టూ కట్టుదిట్ట మైన బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

Updated Date - Mar 20 , 2025 | 11:32 PM