అణగారిన వర్గాల అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Mar 20 , 2025 | 10:40 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో చరిత్రాత్మక బిల్లులకు చట్టబద్ధత కల్పించడం అభినందనీ యమని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

- చరిత్రాత్మక బిల్లులకు సీఎం ఆమోదం
- రైతు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్‌దే..
- ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి
నారాయణపేట, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో చరిత్రాత్మక బిల్లులకు చట్టబద్ధత కల్పించడం అభినందనీ యమని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు క్యారాలయంలో నియోజకవర్గ ముఖ్యనాయకులతో సమావేశమై మాట్లాడారు. బీసీలకు 42 శాతం, ఎస్సీ వర్గీ కరణ బిల్లులు అసెంబ్లీలో ఆమోదం తెలిపా రన్నారు. ఇది వరకు ఉన్న పాలకులు ఎవరూ చేయలేదని, కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ చె ప్పిన విధంగా కట్టుబడి సీఎం రేవంత్‌రెడ్డి రెం డు బిల్లులకు చట్టబద్ధత కల్పించారన్నారు. బడ్జె ట్‌లో అన్ని వర్గాల సంక్షేమంతో పాటు మహిళా సంక్షేమానికి అధిక ప్రాథాన్యత ఇచ్చారన్నారు. ఒక నారాయణపేట నియోజకవర్గంలోనే రూ. 195కోట్ల రైతు రుణమాఫీ అయ్యిందన్నారు. ప్ర భుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి కాంగ్రెస్ కార్యకర్తలు గడప గడపకు వివరించి, రాబోయే స్థానిక సంస్థాగత ఎన్నికల కు సిద్ధం కావాలన్నారు. స్థానిక ఎన్నికల్లో రిజ ర్వేషన్లతో లబ్ధి చేకూరుతుందన్నారు. అంతకు ముందు సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు కాం గ్రెస్ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సదా శివారెడ్డి, వైస్‌చైర్మెన్ హన్మంతు, ఆర్టీవో బోర్డు మెంబర్ పోషల్ రాజేష్, సింగిల్ విండో అధ్య క్షుడు ఈదప్ప, నరహరి, బాల్‌రెడ్డి, హరినారా యణబట్టడ్, సరాఫ్ నాగరాజ్, సాయిబాబ, సుఽ దాకర్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఎమ్మె ల్యేను నియోజకవర్గ ముఖ్య, యువ నాయకు లు పోటా పోటీగా శాలువాతో సత్కరించారు. అదేవిధంగా కస్తూర్బాలో ఎమ్మెల్యే విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేశారు.
నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు
నియోజకవర్గంలో వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు తీసుకో వాలని ఎమ్మెల్యే అన్నారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఆర్‌డబ్ల్యూఎస్ గ్రామీణ ప్రాంత నీటి సరఫరా అధికారులతో సమీక్ష నిర్వహిం చారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్ప టికప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. బోర్ల మరమ్మతు తక్షణమే చేపట్టాలన్నారు.