Share News

గడువులోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలి

ABN , Publish Date - Mar 20 , 2025 | 10:41 PM

లక్ష్యాన్ని గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. గురువారం మం డల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో గ్రా మీణాభివృద్ధి శాఖ, సెర్ఫ్‌ కార్యక్రమాల అమలు తీరుపై సంబంధిత అధికారులు, ఉద్యోగులతో స మావేశమై మాట్లాడారు.

గడువులోపు లక్ష్యాన్ని పూర్తి చేయాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల గురించి ఆరా తీస్తున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

దామరగిద్ద, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): లక్ష్యాన్ని గడువు లోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదేశించారు. గురువారం మం డల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో గ్రా మీణాభివృద్ధి శాఖ, సెర్ఫ్‌ కార్యక్రమాల అమలు తీరుపై సంబంధిత అధికారులు, ఉద్యోగులతో స మావేశమై మాట్లాడారు. బ్యాంకు లింకేజీలో వం ద శాతం లక్ష్యాన్ని నాలుగు రోజుల్లో పూర్తి చే యాలన్నారు. దామరగిద్ద మండలంలో ఇంకా 94 శాతమే ఉండడంతో కలెక్టర్‌ ఏపీఎంపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. న్యూ ఎంటర్‌ ప్రైజెస్‌, అ కౌంట్స్‌ నిర్వహణ ఎంత వరకు వచ్చిందని అడి గి తెలుసుకున్నారు. మండలంలో ఉపాధి హామీ పనులు ఎలా కొనసాగుతున్నాయని ఆరా తీశా రు. కొన్ని గ్రామాలలో పనులకు కేవలం పది మంది మాత్రమే వస్తున్నారని కూలీలకు అవగా హన ఎందుకు కల్పించడం లేదని కలెక్టర్‌ ప్ర శ్నించారు. ఎంపీడీవో మండలంలో ఏం చేస్తున్నా రని నిలదీశారు. పనితీరు మెరుగుపరుచుకో వాలని సూచించారు. సమావేశానికి టెక్నికల్‌ అ సిస్టెంట్‌ హాజరు కాకపోవడంతో షోకాజ్‌ నోటీసు ఇవ్వాలని ఎంపీడీవోను ఆదేశించారు. కార్యక్ర మంలో ఎంపీడీవో సాయిలక్ష్మి, తహసీల్దార్‌ జలీ ల్‌, అదనపు డీఆర్డీవో అంజయ్య, డీపీఎం జయ న్న, ఏపీఎం, సెర్ప్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులలో

మెరుగైన వైద్య సేవలందించాలి

ప్రభుత్వ ఆసుపత్రిపై నమ్మకం ఉంచి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి మెరుగైన సేవలందించాలని కలెక్టర్‌ సిక్తా పట్నా యక్‌ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రాథ మిక ఆరోగ్యో కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశా రు. అన్ని వార్డులను కలెక్టర్‌ పరిశీలించారు. మందుల నిల్వ రిజిస్టర్‌, వైద్య సిబ్బంది హాజరు తనిఖీ చేశారు. ఆసుపత్రిలో నిల్వ ఉంచిన మం దులను, వ్యాక్సిన్లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో కలెక్టర్‌ మాట్లాడి వారికి అందే వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. ఇన్‌ పేషెం ట్‌ వార్డులో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల కు టుంబ తగాదాలతో చెవికి గాయమై చికిత్స కో సం ఆసుపత్రికి వచ్చిన దామరగిద్ద మండల కేం ద్రానికి చెందిన వివాహితతో కలెక్టర్‌ మాట్లా డారు. నిబంధనల ప్రకారం బాధితురాలికి తగిన న్యాయం, సాయం చేయాలని అక్కడే ఉన్న సఖీ కేంద్రం నిర్వాహకురాలు క్రాంతి రేఖకు కలెక్టర్‌ సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సౌభాగ్యలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2025 | 10:41 PM