మహబూబ్‌నగర్, మక్తల్‌లో రెండు కొత్త బార్లు
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:23 PM
మహబూబ్‌నగర్, మక్తల్‌లో రెండు కొత్తబార్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణ యించింది.

- ఈనెల 26 వరకు దరఖాస్తుల స్వీకరణ
- మహబూబ్‌నగర్‌లో ఏడాదికి రూ.42 లక్షలు.. మక్తల్‌లో రూ.30 లక్షలు
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్, మక్తల్‌లో రెండు కొత్తబార్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణ యించింది. రెన్యూవల్ కాని బార్ల స్థానంలో కొత్తబార్ల ఏర్పాటుకో సం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. రాష్ట్రంలో 25 బార్లు ఏర్పాటు చేస్తుండగా అందులో ఉమ్మడి జిల్లాలో రెండు బార్లకు దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ నెల 26లోగా దరఖాస్తులను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉం టుంది. కార్యాలయ పనిదినాలలో ఉదయం 10:30 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆసక్తి గల వ్యక్తులు లక్ష రూపాయల డీడీని సమర్పించాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ మహబూబ్‌నగర్ పేరు పై డీడీ తీయాల్సి ఉంటుంది. బార్ రాని వ్యక్తులకు డీడీ డబ్బు లు తిరిగి ఇవ్వబడవు. ఈనెల 29న ఉదయం 11 గంటలకు మ హబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిన నూత న లైసెన్స్‌దారుడిని ఎన్నుకుంటారు. మహ బూబ్‌నగర్‌లో బార్ ఎక్సైజ్ టాక్స్ ఏడాదికి రూ.42 లక్షలు, మక్తల్‌లో రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.