Share News

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:48 PM

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే జీఎంఆర్‌

ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ

మూసాపేట, మార్చి 23 (ఆంధ్రజ్యోతి) : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి చేపట్టిన భూమిపూజ చేసి, మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు చేపడుతున్నామని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రైతు సంక్షేమంతో పాటు పేద ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, రాష్ర్టాన్ని కోలుకోలేని స్థితి తీసుకొచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు శెట్టి చంద్రశేఖర్‌, ఎంపీడీవో కృష్ణయ్య, మాజీ ఎంపీపీ బగ్గి కృష్ణయ్య, కొండ జగదీశ్వర్‌, బాలనర్సింహులు, రాంచందర్‌, గడ్డం మహేందర్‌, తిరుపతయ్యగౌడ్‌, కావలి నారాయణ, తాజోద్దిన్‌, శెట్టి శ్రావన్‌, శ్రీనివాసులు, లక్ష్మినారాయణ, లక్ష్మయ్య, షేక్‌పాషా, సలాం, రాజు పాల్గొన్నారు.

రైతుల సంక్షేమమే ధ్యేయం

చిన్నచింతకుంట : రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే జీ.మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని దమగ్నాపూర్‌లో ఆయా గ్రామాల రైతులకు సబ్సిడీ కింద ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమలు మహబూబ్‌నగర్‌ వారి ఆధ్వర్యంలో స్ర్పింకర్లు పంపిణీ చేశారు. దేవరకద్ర నియోజకవర్గ హార్టికల్చరల్‌ ఆఫీసర్‌ శృతి, దేవరకద్ర మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కథలప్ప, పీఏసీఎస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, నాయకులు వజీర్‌బాబు, యువజన కాంగ్రెస్‌ నాయకులు ఎస్‌.వెంకటేష్‌, ఎద్దుల మధుసూదన్‌రెడ్డి, శేఖర్‌, ప్రతాప్‌, ప్రవీన్‌కుమార్‌, జాకీర్‌, రవిగౌడు, గోవర్ధన్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:48 PM