Share News

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Mar 23 , 2025 | 11:24 PM

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అలంపూరు ఎమ్మెల్యే విజయుడు అన్నారు.

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

- అలంపూరు ఎమ్మెల్యే విజయుడు

అలంపూరుచౌరస్తా, మార్చి23(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అలంపూరు ఎమ్మెల్యే విజయుడు అన్నారు. ఆదివారం ఆయన అలంపూరు చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి, సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. అయిజ, ఉండవల్లి, ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి, రాజోలి, ఎర్రవల్లి మండలాలకు చెందిన 306మందికి చెక్కులు అంద జేశారు. అలాగే సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు 161మందికి, సుమారు రూ.40లక్షల విలువైన చెక్కులు అందజేశారు. పేదింటి కుటుంబాలు పెళ్లిళ్లు చేయలేక భయపడేవారని అలాంటి సందర్బంగా కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకం నేడు ఆడపిల్లల పెళ్లిళ్లకు ఇబ్బంది లేకుండాపోయింద న్నారు. కార్యక్రమంలో నాయకులు గజేందర్‌రెడ్డి, కరుణసింహారెడ్డి, ఆర్‌.కిషోర్‌, సంకాపురం రాముడు, పచ్చర్ల శ్రీనువాసులు ఉన్నారు.

Updated Date - Mar 23 , 2025 | 11:24 PM