Share News

మసీద్‌లో సీసీ కెమెరాల ప్రారంభం

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:49 PM

అ మరచింత జామియా మసీద్‌లో ముస్లిం కమిటీ వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమ వారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు.

మసీద్‌లో సీసీ కెమెరాల ప్రారంభం

అమరచింత, మార్చి31 (ఆంధ్రజ్యోతి) : అ మరచింత జామియా మసీద్‌లో ముస్లిం కమిటీ వారు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సోమ వారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్‌ కల్లు విభాగం చైర్మన్‌ కేశం నాగరాజు గౌడ్‌, ఆత్మకూరు సీఐ శి వకుమార్‌, ఎస్‌ఐ సురేష్‌తో కలిసి ఎమ్మెల్యే మసీదులో ఏర్పాటు చేసిన 7 సీసీ కెమెరాలను రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో ముస్లింలు సొంత వ్యయంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయ మని అన్నారు. ప్రజలు పోలీస్‌ శాఖతో సమన్వ యంతో ముందుకెళ్తే నేరాలను నియంత్రించవ చ్చని అన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగ రాజుగౌడ్‌, అయుబ్‌ఖాన్‌, బాలకృష్ణారెడ్డి, మ హేందర్‌ రెడ్డి, అరుణ్‌ కుమార్‌, విష్ణు, తౌఫిక్‌, తిరుమలేష్‌, అశ్వక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:49 PM