జోరుగా ట్రాక్టర్ ట్రాలీ రివర్స్ పోటీలు
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:51 PM
ట్రా క్టర్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వ హించిన ట్రాక్టర్ ట్రాలీ రివర్స్ మండల స్థాయి పోటీలు సోమవారం అమరచింతలో జోరుగా కొనసాగాయి.

అమరచింత, మార్చి31 (ఆంధ్రజ్యోతి) : ట్రా క్టర్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వ హించిన ట్రాక్టర్ ట్రాలీ రివర్స్ మండల స్థాయి పోటీలు సోమవారం అమరచింతలో జోరుగా కొనసాగాయి. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో మండలంలోని ఆయా గ్రామాల రైతులు తమ ట్రాక్టర్లతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హోరా హోరీగా సాగిన ఈ పోటీల్లో మొదటి బహుమ తిగా పామిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మ హేష్ గెలుపొందగా.. ఈ విజేతకు రాకేష్ గౌడ్ మొదటి బహుమతి రూ.5,016 అందజేశారు. రెండో బహుమతిగా అమరచింతకు చెందిన డ్రైవర్ శ్రీను గెలుపొందగా బీజేపీ నాయకుడు మంగా అంజి రూ.3,016 అందజేశారు. మూడో బహుమతి విజేత మసికూరు గ్రామానికి చెం దిన ప్రవీణ్ గెలుపొందగా... అమరచింతకు చెందిన బీఆర్‌ఎస్ నాయకుడు జింక రవి రూ.2,016 అందజేశారు. కార్యక్రమంలో నిర్వా హకులు బొగ్గు రఘు, కృష్ణారెడ్డి, శ్రీను, జింక రవి తదితరులు పాల్గొన్నారు.