వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లింల నిరసన
ABN , Publish Date - Mar 31 , 2025 | 11:50 PM
కేం ద్ర ప్రభుత్వం తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం అమరచింత ఈద్గాలో ముస్లింలు నిరసన తెలిపారు.

అమరచింత, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : కేం ద్ర ప్రభుత్వం తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సోమవారం అమరచింత ఈద్గాలో ముస్లింలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రంజాన్ ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముస్లిం యువకులు నల్ల బ్యాడ్జి ధరించి ప్లకార్డులతో ఈ ద్గాలోనే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేం ద్ర ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... ప్ర ధాని నరేంద్రమోదీ ప్రభుత్వం వక్ఫ్ ఆస్తులను దేశంలోని అన్ని మతాల కులాలకు సమానంగా పంచాలని ముస్లిమేతరులకు కూడా సమాన హక్కులు కల్పిస్తూ.. పార్లమెంటులో బిల్లు ప్రవే శపెట్టింది.. అది సరైంది కాదని డిమాండ్ చేశా రు. దేశంలో ముస్లింలు మైనార్టీలుగా కొనసాగు తున్నారు. అలాగే దారిధ్య్రరేఖకు దిగువన జీవి స్తున్నారు. వారి ఆస్తులపై వారికే సొంత హక్కు లను కలిగించేలా నరేంద్రమోదీ ప్రభుత్వం ని ర్ణయం తీసుకోవాలని, ఇదివరకు ప్రవేశ పెట్టిన బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కా ర్యక్రమంలో మైనార్టీ కమిటీ సభ్యులు, యువకు లు పాల్గొన్నారు.