Share News

కోడూరులో హోలీ

ABN , Publish Date - Mar 31 , 2025 | 11:47 PM

మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం కోడూరు గ్రామంలో సోమవారం హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏటా ఉగాది పండుగ మరుసటి రోజు హోలీని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

కోడూరులో హోలీ
హోలీ వేడుకల్లో పాల్గొన్న గ్రామస్థులు

ఏటా ఉగాది మరుసటి రోజు వేడుకలు

మహబుబ్‌నగర్‌ రూరల్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్‌ రూరల్‌ మండలం కోడూరు గ్రామంలో సోమవారం హోలీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఏటా ఉగాది పండుగ మరుసటి రోజు హోలీని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలోని వరదరాజ రామలింగేశ్వర దేవాస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామోత్సవం జరిపారు. అనంతరం జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్‌ రాజేశ్వర్‌ గౌడ్‌ పూజలు చేసి, హోలీ వేడుకలను ప్రారంభించారు. గ్రామంలో యూవకులు, చిన్నారులు, పెద్దలు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ శ్రీకాంత్‌ గౌడ్‌, గ్రామ పెద్దలు, పార్టీల నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:47 PM