యువత సన్మార్గంలో నడవాలి
ABN , Publish Date - Mar 28 , 2025 | 11:27 PM
యు వత సన్మార్గంలో నడవాలని ప్ర ముఖ ధార్మికవేత్త మౌలానా ఉ బేద్‌ఖాద్రీ అన్నారు.

- మౌలానా ఉబేద్‌ఖాద్రీ
మహబూబ్‌నగర్ అర్బన్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): యు వత సన్మార్గంలో నడవాలని ప్ర ముఖ ధార్మికవేత్త మౌలానా ఉ బేద్‌ఖాద్రీ అన్నారు. గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని మసీ దుల్లో షబే ఖదర్ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఎ దిర 4వ వార్డు జామా మసీదులో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని ధార్మిక సందేశం ఇచ్చారు. దైవచింతనలోనే ప్రశాంతత ఉంటుందని తెలిపారు. తమ ఆర్థిక సంపదనలో కొంత పేద లకు ఖర్చు చేయాలని సూచించారు. పవిత్ర ఖురాన్ అవతరించిన రంజాన్ మాసంలో మన పాపాలను క్షమించాలని అల్లాను వేడుకోవాలని తెలిపారు. మసీద్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ హకీం, అబ్దుల్‌అజీజ్, హాఫెజ్ ఫెరోజ్, మౌజాన్ ఫయాజ్‌బాబా, యువకులు పాల్గొన్నారు.
మూసాపేట: మండలంలోని మసీదుల్లో గురువారం రాత్రి షబ్-ఏ-ఖదర్ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా పేష్ ఇమామ్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు, నాథేషరీఫ్, దువా, సలాం కార్యక్రమాలను నిర్వ హించారు. అడ్డాకుల మసీదుల్లో రాత్రంతా దైవ సన్నిధిలో జాగరణ చేశారు.
భక్తిశ్రద్ధలతో జుమ్మాతుల్ విదా
రంజాన్ మాస ఆఖరి శుక్రవారం సందర్భం గా అడ్డాకుల, మూసాపేటలో మసీద్‌లో జు మ్మాతుల్ విదా సామూహిక ప్రార్థనలను నిర్వ హించారు. ముఖ్తార్ అహ్మద్, ఖాజామైనోద్దిన్, కలీమ్, ఖాదర్, ఖాజా గోరి, ఖలీల్, అప్సర్, అబ్దుల్లా, షేక్‌బాలే, ఆజం పాల్గొన్నారు.