Share News

Mahesh Kumar Goud: సామాజిక న్యాయానికి సర్కారు రోల్‌ మోడల్‌

ABN , Publish Date - Mar 11 , 2025 | 04:23 AM

సామాజిక న్యాయం పాటించడంలో కేరాఫ్‌ అడ్ర్‌సగా కాంగ్రెస్‌ పార్టీ నిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అవకాశం వస్తే ఒక సీటు పొత్తులో భాగంగా సీపీఐకి ఇచ్చామన్నారు.

Mahesh Kumar Goud: సామాజిక న్యాయానికి సర్కారు రోల్‌ మోడల్‌

  • కాంగ్రె్‌సలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రముఖ స్థానం: మహేశ్‌

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): సామాజిక న్యాయం పాటించడంలో కేరాఫ్‌ అడ్ర్‌సగా కాంగ్రెస్‌ పార్టీ నిలిచిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అవకాశం వస్తే ఒక సీటు పొత్తులో భాగంగా సీపీఐకి ఇచ్చామన్నారు. తమ పార్టీ నుంచి ముగ్గురిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళకు అవకాశం ఇచ్చామని, సీపీఐ నుంచి కూడా బీసీ అభ్యర్థికి ఇవ్వడం హర్షణీయమని పేర్కొన్నారు. పార్టీలో ఏ అవకాశం వచ్చినా బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ప్రముఖ స్థానం కల్పిస్తామన్నారు.


కులగణన, ఎస్సీ వర్గీకరణ, పార్టీ, ప్రభుత్వ, చట్ట సభల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పదవులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మూల సిద్ధాంతంలోనే సామాజిక న్యాయం ఉంటుందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రోల్‌ మోడల్‌ అని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ అంటేనే సామాజిక న్యాయానికి ప్రతీక అని, పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌ గౌడ్‌ అన్నారు.

Updated Date - Mar 11 , 2025 | 04:24 AM

News Hub