Share News

KCR: కేసీఆర్ నోట మహేష్ బాబు డైలాగ్.. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Jan 31 , 2025 | 03:28 PM

KCR: రేవంత్ ప్రభుత్వానికి మాజీ సీఎం కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నానని అన్నారు. తాను కొడితే మామూలుగా ఉండదని అన్నారు. గట్టిగా కొట్టడం తనకు ఉన్న అలవాటు అని చెప్పారు. రాబోయే ఫిబ్రవరి నెల చివరిలో తెలంగాణలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.

KCR: కేసీఆర్ నోట మహేష్ బాబు డైలాగ్.. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
KCR

సిద్దిపేట: తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (BRS Chief KCR) ఆరోపించారు. ఆరుగ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ(శుక్రవారం) జహీరాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. కోహీర్, జహీరాబాద్, ఝారసంఘం, మొగుడాంపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


కొడితే మాములుగా ఉండదు..

‘‘నేను గంభీరంగా, మౌనంగా ఈ ప్రభుత్వాన్ని చూస్తున్నా. కొడితే మామూలుగా కాదు గట్టిగా కొట్టడం నాకున్న అలవాటు ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగసభ నిర్వహిస్తాం. రాష్ట్రంలో ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడుకున్నాయి. సంగమేశ్వరం, బసవేశ్వరం, కాళేశ్వరం ఎండబెడుతున్నారు. మన విజయం తెలంగాణ ప్రజల విజయం. రాబోయే రోజుల్లో విజయం మనదే. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి. తెలంగాణలో భూముల ధరలు అమాంతం పడిపోతున్నాయి. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్ టెండర్లను.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపింది. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులపై.. భారీ దండయాత్ర చేయాలి. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు నీళ్లు రావాలి. ఆలోచన లేకుండా ఎవడో ఏదో చెప్తే.. నమ్మి ఓటేస్తే తెలంగాణకు మంచి గుణపాఠం లభించింది. కైలాస ఆటలో పైకి వెళ్లాక పెద్ద పాము మింగినట్టు రాష్ట్ర పరిస్థితి అయింది. కరోనాలో కూడా రైతుబంధు ఇచ్చి.. రైతుల కోసం మంచి పథకాలను నేను అమలు చేస్తే అంతా గంగలో కలిసిపోయింది. గురుకుల హాస్టళ్లలో తిండి బాగా లేక.. పిల్లలు అనారోగ్యం బారినపడుతున్నారు. బీఆర్ఎస్ రాజకీయాల కోసం పుట్టింది కాదు. ఇక లాభంలేదు.. ప్రత్యక్ష పోరాటాలే. కాంగ్రెస్ పాలనలో రైతుబంధుకు రాంరాం. దళితబంధుకు జైభీమ్‌ చెప్పేశారు. తులం బంగారం పథకం గోవిందా. కాంగ్రెస్‌ పాలనపై అంతటా అసంతృప్తి. అన్నివర్గాలను ముంచిన పార్టీ కాంగ్రెస్. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లైంది. గురుకులాల్లో చదువు అగమ్యగోచరం. మళ్లీ కరెంట్ కోతలు.. నీళ్ల వెతలు. పాలనా వైఫల్యాన్ని నిలదీస్తే కేసులా. కాంగ్రెస్ పాలనపై దండయాత్ర చేద్దాం. తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగ్గా అమలుకావడం లేదు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంది. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్ట్ టెండర్లను.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఆపింది. టెండర్లు అడ్డుకోవడం వెనుక మతలబు ఏంటి. ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారు’’ అని రేవంత్ ప్రభుత్వంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: కాంగ్రెస్‌ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు

Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ

Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 31 , 2025 | 03:52 PM