Share News

నిధుల వరద

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:41 AM

భువనగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల తో నియోజకవర్గంలోని భువనగిరి, భూదాన్‌పోచంపల్లి మునిసిపాలిటీలతోపాటు భువనగిరి, పోచంప ల్లి, బీబీనగర్‌ మండలాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నిధుల వరద

భువనగిరి నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ.56.18కోట్లు

హెచ్‌ఎండీఏ ద్వారా నిధులు మంజూరు

భువనగిరి, బీబీనగర్‌, భూదాన్‌ పోచంపల్లి మండలాల్లో

సీసీ, బీటీ, అండర్‌గ్రౌండ్‌ పనులకు కేటాయింపు

(ఆంధ్రజ్యోతి-యాదాద్రి): భువనగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ నిధుల తో నియోజకవర్గంలోని భువనగిరి, భూదాన్‌పోచంపల్లి మునిసిపాలిటీలతోపాటు భువనగిరి, పోచంప ల్లి, బీబీనగర్‌ మండలాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి, బీబీనగర్‌, భూదాన్‌పోచంపల్లి మండలాలు హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవెల్‌పమెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండీ ఏ) పరిధిలో ఉంటాయి. అయితే ఈ ప్రాంతాల్లో స్థిరాస్థి వ్యాపారం జోరుగా సాగుతోంది. కొత్త లేఅవు ట్లు, వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయిస్తుంటారు. హెచ్‌ఎండీఏ సాంకేతిక అనుమతి తప్పనిసరిగా అవస రం ఉండటంతో ఎల్‌ఆర్‌ఎ్‌సతోపాటు పలు రకాల ఫీజు లు వసూలు చేస్తుంది. అయితే స్థానికంగా ఉన్న గ్రా మాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మునిసిపల్‌ శాఖ మంత్రితోపాటు హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులకు లేఖ లు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం హెచ్‌ఎండీఏ ద్వారా నియోజకవర్గానికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేసింది. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఈ మేరకు ఆయా మునిసిపాలిటీల్లో చేపట్టాల్సిన పనుల కోసం అంచనాలు రూపొందించి హెచ్‌ఎండీఏకు నివేదించారు. ప్రభుత్వం ఎమ్మెల్యే విన తి మేరకు హెచ్‌ఎండీఏ నుంచి రూ.56.18కోట్లు మం జూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ నిఽధులతో వీటిని చేపట్టడంతోపాటు నూతనంగా మౌలిక వసతుల కల్పన అంచనాలు రూపొందించారు. ప్రధానంగా సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు నిర్మించనున్నారు. ఈ నిధుల్లోనుంచి రూ.5.80కోట్ల తో భువనగిరి పట్టణంలో ని ప్రధాన రహదారి పై ఫుట్‌పాత్‌ పనులు, రూ.7.80 కోట్ల తో పట్టణంలోని పలు సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టనున్నారు. భువనగిరి మండలంలోని పలు గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీ పనులు చేపట్టేందుకు రూ.9.50కోట్లు కేటాయించారు. భూదాన్‌పోచంపల్లి మునిసిపాలిటీ పరిధిలో రూ.7.90కోట్లతో సీసీరోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చేపడతారు. భూదాన్‌పోచంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల్లో చేపట్టను న్న పనులకు రూ.9.10కోట్లు కేటాయించారు. బీబీనగర్‌ మండలాల్లోని పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌం డ్‌ డ్రైనేజీ నిర్మాణాలకు రూ.16.08కోట్లు మంజూరయ్యా యి. నిధులు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతు లు మంజూరు కావడంతో పనులు చేపట్టేందుకు ఆ యా శాఖలు సన్నద్ధమవుతున్నాయి. భువనగిరి మునిసిపాలిటీ ఏర్పాటై చాలా ఏళ్లు గడుస్తున్నా, ప్రజలకు మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నా యి. ఈ నేపథ్యంలో భువనగిరి జిల్లా కేంద్రం కూడా కావడంతో అన్ని హంగులతో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మునిసిపాలిటీల్లోని అన్ని వార్డుల్లోనూ కలియ తిరుగుతూ... అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. ఈ మేరకు అధికారులతో సమీక్షలు నిర్వహించి, అభివృద్ధి పనులపై నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

అసంపూర్తి పనులపై ప్రత్యేక దృష్టి

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పట్టణంలోని ప్రధాన రహదారిని మూడు కిలోమీటర్ల మేరకు విస్తరించారు. అయితే ప్రభుత్వం మారిపోవడం తో పలు పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. వీటికి నిధులు కేటాయించి పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పట్టణంలో అసంపూర్తిగా ఉన్న విద్యుత్‌ టవర్ల పనులకు రూ.4 కోట్లు కేటాయించి పూర్తిచేశారు. అదేవిధంగా డబుల్‌బెడ్‌రూం ఇళ్ల సముదాయం వద్ద మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం రూ.2.50 కోట్లు మంజూరు చేసింది. గతంలో భువనగిరి మునిసిపాలిటీ పరిధిలోని బొమ్మాయిపల్లి రోడ్డు నుంచి రాయిగిరి వరకు 100 అడుగులతో రోడ్డును అభివృద్ధి చేశారు. టీచర్స్‌ కాలనీ నుంచి నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్‌ వరకు 2.12 కిలో మీటర్ల మేరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయి. రోడ్డు విస్తరణతో పాటు మొత్తం పలు పనులకు రూ.20కోట్ల మేరకు కేటాయించారు. తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ ఫ్రాస్ట్రక్చర్‌ డెవెల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (టీయూఎ్‌ఫఐడీసీ) నిధులు రూ.15కోట్లు, హెచ్‌ఎండీఏ నిధులు రూ.5కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రస్తుతం రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అర్బన్‌ ఫారెస్టు నిధులతో చెరువు సుందరీకరణ పనులు, అదేవిధంగా పట్టణంలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను నిర్మించారు. నిధులు లేకపోవడంతో మార్కెట్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ పనులపై కూడా దృష్టి కేంద్రీకరించారు.

మౌలిక వసతుల కోసం నిధులు మంజూరు : భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

భువనగిరి నియోజకవర్గంలో పలుఅభివృద్ధి పనులు చేపట్టేందుకు హె చ్‌ఎండీఏ రూ.56.18కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో భువనగిరి, బీబీనగర్‌, పోచంపల్లి మండలాల్లో మునిసిపాలిటీల్లో, గ్రామాల్లో సీసీ, బీటీ, అండర్‌గ్రౌండ్‌తో పాటు మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోనున్నాం. గతంలో ఎన్న డూ లేవివిధంగా హెచ్‌ఎండీఏ పెద్దఎత్తున నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించింది. నిత్యం ఉన్నతాధికారుల పర్యవేక్షణతో నిధుల మంజూరు సాధ్యమైంది.మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించి అర్బన్‌ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం.

Updated Date - Apr 02 , 2025 | 12:41 AM