Share News

రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర

ABN , Publish Date - Mar 29 , 2025 | 01:02 AM

భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని ప్రభు త్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు.

రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర
సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ అయిలయ్య

ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య

ఆలేరు, గుండాల, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రపన్నుతోందని ప్రభు త్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. శుక్రవారం ఆలేరులోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జైబాపు, జైభీమ్‌, జై సంవిధాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అనంతరం ఆలేరులోని మైనార్టీ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి ఉపేందర్‌రెడ్డి, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇనచార్జి సంధ్యారెడ్డి, నాయకులు వెంకటేశ్వర రాజు, ఎజాజ్‌, నాయకులు గంధమల్ల అశోక్‌, నరేందర్‌ రెడ్డి, శమంతారెడ్డి, చింతలఫణి సునీతారెడ్డి, ఎగ్గిడి యాదగిరి, విజయ్‌కుమార్‌, వెంకటస్వామి, ఎం.శ్రీకాంత, శ్రీనివా్‌సరెడ్డి, సతీష్‌, కాసుల భాస్కర్‌, అనిత పాల్గొన్నారు. బడుగు బలహీన పేద వర్గాలకు భారత రాజ్యాంగం ఎన్నో హక్కులను కల్పించిందని, పార్లమెంట్‌ సాక్షిగా బీజేపీ రాజ్యాంగాన్ని అణగదొక్కాలని చూస్తోందని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు జై బాపు, జై బీమ్‌, జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా గుండాల మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నవాబుపేట రిజర్వాయర్‌ కింద ఉన్న దేవాదుల కాల్వ పనులు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పూర్తి కాలేదని త్వరలో దేవాదుల కాల్వ పనులు పూర్తి చేసి రానున్న రోజుల్లో మండలానికి సాగు నీరు అందించి సస్యశ్యామలం చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇనచార్జి సంధ్యారెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరిగౌడ్‌, పార్టీ మండల అధ్యక్షులు ఏలూరి రాంరెడ్డి, మాజీ ఎంపీపీలు ద్యాప కృష్ణారెడ్డి, వేణు, పీఏసీఎస్‌ చైర్మన భిక్షం పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2025 | 01:02 AM