వన్యప్రాణుల దాహార్తిని తీర్చేలా..
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:02 AM
వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

(ఆంధ్రజ్యోతి-నాగార్జునసాగర్):
వేసవిలో వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో మొత్తం 14,25 లక్షల హెక్టార్ల భౌగోళిక విస్తీర్ణం ఉండగా అందులో 41 వేల హెక్టార్లలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ అటవీ ప్రాంతంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారె్‌స్టలో నాగార్జునసాగర్ డివిజన్‌లో 27,675 హెక్టార్ల విస్తీర్ణంలో వన్యప్రాణి సంరక్షణ విభాగం ఉంది. ఇం దులో మనుబోతులు, జింకలు, నెమళ్లు, రేసు కుక్కలు, కుందేళ్లు, అడవి పందులు, దుప్పులు వంటి జంతువులు ఉన్నాయి. వీటి దాహార్త్తిని తీర్చేందుకు వానాకాలం మొదలైనప్పటి నుంచి (జూన్ నెల ప్రారంభం నుంచి) అప్పుడు కురిసే వర్షాలతో అడవిలో ఏర్పాటు చేసిన చెక్ డ్యామ్‌లు, సాసర్ పిట్స్‌ల్లో నీరు ఉం టుంది. ఆ నీటితో జంతువులు తమ దాహార్త్తిని తీర్చుకుంటాయి. జనవరి చివరి వరకు అడవిలో వన్యప్రాణుల దాహార్తీని తీర్చుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు ఉం డవని అటవీ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి నెల నుంచి ఎండలు ఎక్కువ కావడంతో సాసర్ పిట్లల్లో, చెక్ డ్యామ్‌ల్లో ఉన్న నీరంత ఆవిరి అవుతోంది. దీంతో వన్యప్రాణలు దాహార్త్తిని తీర్చేందుకు అధికారులు అటవీలో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
సాగర్ అటవీ రేంజ్‌లో 33 సాసర్ పిట్స్
నాగార్జునసాగర్ అటవీ విభాగంలో సాగర్ అటవీ రేంజ్‌లో వన్యప్రాణలు దాహార్త్తిని తీర్చేందుకు నాగార్జునపేట తండా వద్ద 5, శివం హోటల్ వెనుక వైపున 13, సమ్మక్క-సారక్క ఆలయం వద్ద 15 సాసర్ పిట్స్‌లను ఏర్పాటు చేశారు. మొ త్తం 33 సాసర్ పిట్స్‌లతో పాటు సోలార్ బోర్‌వెల్స్ 4 ఉన్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సాసర్ పిట్స్‌ల్లో ఫిబ్రవరి ప్రారంభం నుంచి మే చివరి వరకు ట్యాకర్లతో నీటిని నింపుతున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఒక్క ట్యాంకర్‌కు సుమారు వెయ్యి నుంచి రూ. 1500 వరకు ఖర్చు అవుతుందన్నారు.
ట్యాంకర్లతో సాసర్ పిట్స్ నీటిని నింపుతున్నాం
సాగర్ అటవీశాఖ రేంజ్‌లో వేపవిలో వన్యప్రాణులు దాహార్త్తిని తీర్చేందుకు సాస ర్ పిట్స్‌ల్లో ట్యాంకర్లతో నీటిని నింపుతున్నాం. సాగర్ రేంజ్‌లో వన్యప్రాణుల సంరక్షణ కోసం త్వరలో సీసీ (ట్రాప్) కెమెరాలను ఏర్పాటు చేస్తాం.
- రాఘవేంద్రరావు, సాగర్ అటవీ శాఖ రేంజర్